న్యూజెర్సీలో టిక్కెట్లు దొరకడం లేదు ..

Pawan Kalyan

పెద్ద హిరో సినిమా అంటే న్యూజెర్సీలో విచ్చలవిడిగా అన్నీ థియేటర్స్‌లో రిలీజ్ చేసేవారు. (to my knowledge: గబ్బర్‌సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మిర్చి & బాద్‌షా). ఈ సారి ఏమైందో ఏమిటో .. ముష్టి మూడు థియేటర్స్‌లో మాత్రమే రిలీజ్ చేసారు. అదీ వెరీ లిమిటెడ్ షోస్. ఈ రోజు వెళదాం అంటే నో టిక్కెట్స్. గతిలేక రేపు 2PM షోస్ కు బుక్ చేసుకున్నాం. stay tuned for delayed pawanfans.com exclusive review.

అమెరికాలో టిక్కెట్టు రేటు గురించి ఇంతకు ముందే చెప్పడం & తిట్టడం జరిగింది కాబట్టి, ఈసారి పైరసీతో పవన్‌కల్యాణ్ ఇమేజ్‌ను కాంపేర్ చేస్తున్న %^!@&~&@లకు:
పైరసీ వచ్చినా మా సినిమా చించేసిందనే మాటలు ఆపండ్రా బాబు .. తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో ..

మీ ఉద్దేశం పవన్‌కల్యాణ్ స్టామినా చెప్పడం అయితే, వేరే రకంగా పొగడండి ..

టిక్కెట్టు రేటు భారం మోయలేక, సినిమా అందుబాటులో లేక పైరసీ చేసే సినిమా పిచ్చోళ్ళను వదిలేసి 🙂 ,

పైరసిపై డబ్బులు సంపాదించే వాళ్ళను తిట్టండి .. వాడేవడో పెట్టాడు, చూడటం మా తప్పేంటి అని వితండవాదం చేసే వాళ్ళను తిట్టండి .. వేరే పెద్ద హిరో సినిమా అయినా, చిన్న సినిమా అయినా, ఫ్లాప్ సినిమా అయినా పైరసి చెయ్యడం తప్పని ఖండించడంతో పాటు పాటించండి.

నిజంగా పైరసి వలన నష్టపొతున్న వాళ్ళపై మమకారం వుంటే, హిరోతో సంబంధం లేకుండా పైరసిపై పొరాటం చెయ్యాలి. మా హిరో కాదు కదా, మేము పైరసీ ఎంకరేజ్ చేస్తాం అంటే, దానంత నీచమైన చర్య మరొకటి వుండదు.

పైరసీ వచ్చినా మా సినిమా చించేసిందంటే పైరసీని ఎంకరేజ్ చేస్తున్నట్టు. టాక్ ఎవరేజ్ అని వచ్చినా, తేడా అని వచ్చినా, పైరసీ వలన, సినిమాపై పెట్టుబడి పెట్టిన వాళ్లకు దూల తీరిపొద్ది అని తెలుసుకోండి.

bottomline:
దయచేసి పైరసీ భూతంతో హిరో ఇమేజ్‌కి ముడి పెట్టవద్దు.

Filed Under: Pawan KalyanFeatured