స్టైలిష్ కాదు, కన్నింగ్ స్టార్ అల్లు అర్జున్

sarrainodu-gana

2015, ఆగష్టు 22న మెగా అభిమానుల చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో, పవర్‌స్టార్ పవర్‌స్టార్ అనే అరుపులు మెగాస్టార్‌కు అవమానం అని భావిస్తూ, నాగేంద్రబాబు పవన్‌కల్యాణ్‌పై చేసిన విమర్శలకు రామ్‌చరణ్ ఎంతో షాక్‌కు గురయ్యి బిక్క మొహం వేసుకొని చూస్తుంటే, అల్లు అర్జున్ మాత్రం కల్లు త్రాగిన కోతిలా వెకిలి నవ్వులు నవ్వుతూ పవన్‌ఫాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. సొంత అన్నయ్య నాగబాబుకు , సొంత తమ్ముడిపై ఆ మాత్రం అధికారం లేకపొతే ఎలాలే అని నాగేంద్రబాబు మాటలు పవన్‌ఫాన్స్ క్షమించినా(ఏమీ చేయలేక), అల్లు అర్జున్ వికృతపు చేష్టలు వాళ్ళ మదిలో అలానే వున్నాయి. (అత్తమ్మ తిట్టింది అని కాదు, తోటి కోడలు నవ్వినందుకు అని ఎదో సామెతలా)

పవర్‌స్టార్ పవర్‌స్టార్ అని సహజంగా వచ్చే అరుపులను(ఖుషి సినిమాకు ముందు నుంచి ఈ అరుపుల రచ్చ వుంది .. ఇది కొత్తగా మొదలైంది కాదు) పెద్ద నేరంగా చూసే అల్లు అర్జున్, స్టైలిష్ స్టార్ స్టైలిష్ స్టార్ అని డబ్బులిచ్చి మరీ జనాలచేత అరిపించుకొవడం విశేషం.

సర్దార్ గబ్బర్‌సింగ్ రిలీజ్ సందర్భంగా పవన్‌కల్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూస్‌లో “నేను ఎన్.టి.ఆర్ .. రామ్‌చరణ్ లా డాన్స్‌లు చెయ్యలేను” అని అన్నాడు. వాళ్ళకు ధీటుగా కష్టపడి డాన్స్ చేసే అల్లు అర్జున్ పేరు చెప్పలేదు. అది కూడా మనసులో పెట్టేసుకున్నాడు.

సరైనోడు ఆడియో ఫంక్షన్‌లో “పవర్‌స్టార్ పవర్‌స్టార్ అనే అరుపులకు సమాధానంగా. మెగాస్టార్ తారు రోడ్డు అంటూ” మెగాస్టార్‌ను పొగుడుతున్నట్టుగా, తెలివిగా పవన్‌కల్యాణ్ మీద పంచ్‌లు వేసాడు. రాజకీయల్లోకి వచ్చి తనపై తనకు అభద్రత భావం ఏర్పర్చుకున్న చిరంజీవి, దాసరి నారాయణరావు మాదిరి, ఈ మధ్య తన డబ్బా తనే కొట్టుకుంటున్న చిరంజీవి, అల్లు అర్జున్ మాటల్లో గుడార్దాన్ని గమనించాడో లేదో కాని, పవన్‌ఫ్యాన్స్‌కు క్లియర్‌గా అర్దం అయ్యింది. మొన్న సరైనోడు విజయోత్సవంలో బయట పడిపొయాడు. ఇష్టం లేకపొతే ఇగ్నోర్ చేయవలసిన అరుపులకు “పవన్‌కల్యాణ్ పేరు నేను చెప్పను .. ఏమి పీక్కుంటారో పీక్కొండి ” అని అంటూ .. తెలివిగా చిరంజీవి 150వ సినిమా 150 కోట్ల షేర్ సాధించాలని మిగింపు ఇచ్చాడు. ఇక్కడ కూడా చిరంజీవిపై ప్రేమ అనేది పెద్ద నటన.

చిరంజీవి మెగాస్టార్ అవ్వడంలో అల్లు అరవింద్ పాత్ర కీలకం. ఆ విషయం మెచ్యూర్డ్ మెగాఫ్యాన్స్ అందరికీ తెలుసు. అంతే కాదు, చిరంజీవికి అల్లు అరవింద్ ఒక కవచంలా వుంటాడని, చిరంజీవి తీసుకునే తప్పుడు నిర్ణయాలకు అల్లు అరవిందే బాద్యత వహిస్తూ, మంచి పేరును మాత్రమే చిరంజీవికి అపాదిస్తూ, చెడ్డపేరును తనపై వేసుకుంటాడని, మెచ్యూర్డ్ మెగాఫ్యాన్స్‌కు అల్లు అరవింద్ అంటే ఎంతో గౌరవం. ఆ గౌరవాన్ని పొగొట్టే విధంగా చిరంజీవిని మెగాస్టార్ చేసిందని అల్లు అరవిందే అనే మీనింగ్ వచ్చే విధంగా సరైనోడు ప్రమోషన్స్‌లో అల్లు అర్జున్ మాట్లాడటంతో, చిరంజీవి అభిమానులకు అల్లు అర్జున్ అంటే బాగా మండుతుంది.

చిరంజీవికి, చిరంజీవి ఫ్యాన్స్‌కు చిరంజీవి వారసుడు రామ్‌చరణ్. చిరంజీవి ఫ్యాన్స్, చిరంజీవిని ఎంతగానో ప్రేమించే పవన్‌కల్యాణ్‌ను విమర్శించడానికి కూడా వెనుకాడరు. ఒకప్పుడు మెగాఫంక్షన్స్‌లో “పవర్‌స్టార్ పవర్‌స్టార్” అనే అరుపులను, పవన్‌కల్యాణ్ అంటే ఎంతో ఇష్టపడే చిరంజీవి కూడా, ఈ మధ్య అవే అరుపులకు అసహానానికి గురి అవుతున్నాడు. దానికి ప్రధానమైన కారణాలు 1) రాజకీయాల్లో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు & జరిగిన అవమానాలు ద్వారా ఏర్పడిన అభద్రతా భావం 2) వయసు 3) రామ్‌చరణ్ మీద ప్రేమ అయివుండొచ్చు. పవన్‌కల్యాణ్‌నే తక్కువగా చూసే, చిరంజీవి & చిరంజీవి అభిమానులు అల్లు అర్జున్‌ను రామ్‌చరణ్‌ను మించి అభిమానించడం అసంభవం.

ప్రస్తుతం అల్లు అర్జున్ ఫుల్ ఫార్మ్‌లో వుండటం వలన, రామ్‌చరణ్‌ను అల్లు అర్జున్ మించి పొయాడని రామ్‌చరణ్‌ను తగ్గించడనికి వస్తున్న విమర్శలను , స్టైలిష్ స్టార్ పవర్‌స్టార్‌ను మించి పొయాడని రాంగోపాలవర్మ చేస్తున్న కామెంట్స్ & ఎన్.టి.ఆర్ ను తగ్గించడానికి అల్లు అర్జున్ ఎన్.టి.ఆర్ ని మించి పొయాడని అనే కామెంట్స్ అల్లు అర్జున్ మీద ప్రేమతో కాదని గ్రహించాలి. అవే కామెంట్స్ నిజం చెయ్యడానికి మరింత కష్టపడాలి. అంతే కాని, మెగాఫ్యాన్స్ సపొర్ట్ లేకపొయినా , వేరే వాళ్ళ మీద ద్వేషంతో నన్ను ప్రేమించే వాళ్ళ సపొర్ట్ నాకుందని విర్ర వీగితే, ఫార్మ్‌లో లేనప్పుడు పాతాళానికి పొవడం ఖాయం. మీరే సొంతంగా క్రియేట్ చేసుకొని, చిరంజీవి చేత ఇప్పించుకున్న స్టైలిష్ స్టార్ బిరుదు కాస్తా కన్నింగ్ స్టార్ అయిపొయే సూచనలు పుష్కలంగా అల్లు అర్జున్‌లో కనిపిస్తున్నాయి అంటున్నారు మెగాఫ్యాన్స్.

bottomline:
నాగేంద్రబాబు తన తప్పు తెలుసుకొని మౌనం వహిస్తున్నాడు. ఫార్మ్‌లో వున్నాను కదా అని అల్లు అర్జున్ రెచ్చిపొతున్నాడు. మెగాఫ్యాన్స్ మధ్య బయట వాళ్ళు పుల్లలు పెట్టడం సాదారణ విషయం. మెగాఫ్యామిలీలో లేని విబేధాలు, మెగా హిరోలే వున్నట్టు కావాలని క్రియేట్ చేస్తే, మెగా హిరోలందరికీ ముప్పు. తాము కూర్చోని వున్న కొమ్మను తాము నరుక్కున్నట్టే అని మెగా హిరోలు తెలుసుకుంటే మంచిది.

రామ్‌చరణ్ మగధీరతో తనకు తెలుగు ప్రేక్షకులందరి నుండి యూనివర్సల్ లైకింగ్ మొదలయ్యిందనే విషయం ఒప్పుకోకుండా, తన కష్టంతోనే వచ్చిందని నిరూపించుకొవడానికి ఎంతో గానో కష్టపడుతున్న రాజమౌళి, ఎదిగిన కొద్ది ఎంత ఒదిగివుండాలో రాజమౌళిని చూసి నేటి యువ హిరోలు నేర్చుకొవాలి.

Filed Under: సరైనోడు

commentscomments

 1. Ramesh Naidu Gorle says:

  Hello brother Pawan Kalyan ante andariki (Mega Family vallaki & Mega Fans ki) chala abhimanam vundi, kani ila vekili chestalu chese Exclusive Pawan Fans valle P1 ki cheddaperu vastundi, so mundu meeru other mega heros ni nindinchatam mani ee spl fans ki cheppandi P1 paruvu tiyyoddani. Nijaniki spl. fans & mee personal opinions ni ila migata mega family meeda ruddi maa lanti nijamyna P1 fans ni badapettoddu, u should remember, memu vijayalu vachhinappudu kalar agaresi, apajayalu vaste vere panchana cheri vallam kadu. so, ilanti mega family ni & mega fans ni vidadeese vratalu mani andarini eka tatipyki techhe panu lu cheyandi please.

 2. Hari says:

  Ramesh, పబ్లిక్ ఫంక్షన్స్ అన్నీ, ఎదో గోలతోనే ఇలానే వుంటాయి. గోల లేకపొతే సంతాప సభల్లా వుంటాయి.

  హిరోలు విజ్ఞతతో వ్యవహరించాలి. సున్నితమైన విషయాలను సున్నితంగా డీల్ చెయ్యాలి. అలా డీల్ చేయకపొతే, సినిమాలు చూడోద్దని, ఇప్పుడు దేశవ్యాప్తంగా అమీర్‌ఖాన్‌పై పగబట్టినట్టు, మెగా ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్‌పై పగ బడతారు.

 3. RK says:

  Well said ramesh garu.

 4. RK says:

  sorry. Well said by hari.

 5. Ramesh Naidu Gorle says:

  Of course gola varaku ok kani gandaragola paristitulu rakudadu, aa madya chala functions lo ee exclusive P1 fans valla chala mandi heros ibbandipaddaru adi P1 ki cheddaperu tecchindi, memu kuda gola chestam, but there is a limit, naa vuddeshyam maa P1 fans ni vimarshindadam kadu kani mega fans & P1 fans ani vere chese panulu cheyyoddani, meeru kuda vimarsalu achituchi vrayandi, please this is my personal request. Nenu a hero ni leda valla abhimanulani vimarshichanu, kani meeru ila vraste vallu mammalni comment chestaru meelo meeke padadani adi especially naku bada kaligistundi, thats it. Thank u.

 6. Pawan says:

  @Ramesh Naidu Gorle
  Well Said Sir…

  @Hari
  See Mr Hari,
  Allu Arjun didn’t make any bad comments on POWERSTAR and Pawan Kalyan is not even guest for the Success Meet.
  It’s up to his own wish to speak about Powerstar, Megastar or anybody.
  We should not force him to speak about..
  In which occasion Chiranjeevi Annayya praised himself?
  U said Allu Arjun’s love on Chiranjeevi Annayya is simply an acting.
  Can you plz tell me why he needs to act like that?

  Everybody has right to release their films in other languages. It’s up to ppl wish to see the movie or not. Pawan did the same. RGV made bad comments on Powerstar as his movie spoiled the stamina of telugu movie in Bollywood.You supported his comments.

  Do you think only Rajamouli has right to release his films in all languages?

  Even though Kamal Khan made worst comments on Pawan Annayya,there is no article from you to condemn those comments.

  Allu Arjun didn’t even comment on POWERSTAR, he simply said that he wouldn’t speak. Still I am not getting what’s wrong on this and everybody highlighting this as a National Issue.

 7. Hari says:

  Pawan, thanks for your time and posting your response.

  హ్యాపీ ఆడియో ఫంక్షన్‌కు, జులాయి ఆడియో ఫంక్షన్‌కు ఎందుకు పిలిచారు? .. 1)పవన్‌కల్యాణ్ పెద్దవాడు .. 2) పవన్ అభిమానులు కూడా అల్లు అర్జున్‌ను ఓన్ చేసుకుంటారనే కదా !

  మరి ఇప్పుడు పవన్‌కల్యాణ్ గురించి, అల్లు అర్జున్‌ను కూడా ఇష్టపడే పవన్ అభిమానుల కోసం ఒక్క మాట మాట్లాడితే పొయేది ఏముంది?

  next point:
  సర్దార్ గబ్బర్‌సింగ్ హిందీలో రిలీజ్ చేసుకొనే హక్కు పవన్‌కల్యాణ్‌కు లేదనటం లేదు. బాహుబలి తేడా జరిగుంటే, రాజమౌళీని బండబూతులు తిట్టేవాళ్ళు.

  ఫ్లాప్ అయినపుడు అటువంటి విమర్శలు తప్పవు. లైట్ తీసుకొవాలి.

 8. raju says:

  mr hari garu ramesh garu cheppina dantlo tappu emi vundi.ayina meeru allu arjun ni enduku takkuva chesi matladataru.ayanaki own fan following vundi.edo meeru chuddam valle AA movies hit ayinattu matladatunnaru.ayina meku pawan ante ela vuntundo maku AA ni ante alage vuntundi.nakuu PK ante istam.kani acting kadu ayana heling nature istam.meru AA gurinche tappu ga matladavaddu.ayana oka manusu audio function lo crct gane matladaru aa visayam meku telusu kani meeru oppukoru.ram gopal varma pawan fans meeda vesina cmnts crctee.ayana tappu ledu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *