చూడచ్చో లేదో ..

26:11

నా సినిమా, నా ఇష్టం వచ్చినట్టు తీస్తాను. ఇష్టం వుంటే చూడండి, లేకపొతే లేదు అంటే ఆ థీరి ఎక్కువ రోజులు వర్కవుట్ కాదు. 50 రూపాయలు డబ్బులు పెట్టి మూడు గంటలు పాటు సినిమా కోసం వెచ్చిస్తారు సినిమా ప్రేక్షకులు. సో, సినిమా ప్రేక్షకుడికి అర్దమయ్యేలా ప్రేక్షకుడు మీద గౌరవంతో తీయ్యాలి.

“నా సినిమా, నా ఇష్టం” అనే పంధాను మార్చుకొని “ప్రేక్షకుడిని మెప్పించడమే” అనే లక్ష్యంతో చాలా సీరియస్ గా వర్క్ చేసి ఎక్కడ తప్పులు చేస్తానన్న భయంతో “26/11 ఇండియా పై దాడి” సినిమా తీసాను అంటున్నాడు జీనియస్ రాంగోపాలవర్మ.

వయలెన్స్ సినిమాలు అంత ఇంటరెస్ట్ వుండదు మరియు కొన్ని రోజుల పాటు హృదయాన్ని తలచి వేసిన ఒక నిజమైన సంఘటనను మళ్ళి గుర్తు చేసుకోవాలా అని చూడదల్చుకోలేదు. కాని రాంగోపాలవర్మ ఇంటర్వ్యూస్ చూసాకా ఈ సంఘటనను సినిమాగా ఎలా మలిచాడు, ఏ విధంగా నారేట్ చేసాడో చూడాలనిపిస్తుంది. చూడచ్చో లేదో ..

2008లో ముంబయ్‌లో జరిగిన తీవ్రవాద దాడుల నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఇండస్ ఇన్‌స్పిరేషన్స్ పతాకంపై ఎన్.ఎ.కాంతారావు నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది.

Filed Under: Extended FamilyFeatured