‘అత్తారింటికి దారేది’, ‘మగధీర’ను దాటేసింది!

Screen Shot 2013-10-21 at 8.44.05 PM

అత్తారింటికి దారేది’ విడుదలై, 25 రోజులైంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాటలను బట్టి, ఓవరాల్‌గా ‘అత్తారింటికి దారేది’, ‘మగధీర’ను దాటేసినట్టు వుంది. ఇంకా కొన్ని ఏరియాస్‌లో మగధీర సినిమానే టాప్‌లో వుంది. ఫుల్ రన్‌లో అవి కూడా దాటేస్తుంది. టిక్కెట్టు రేటు పెరగడం ఏడ్వాంటేజ్ అయితే, పైరసీ భూతం పెద్ద మైనస్.

ఇది ముమ్మాటికీ ప్రేక్షకుల విజయం.

‘అత్తారింటికి దారేది’ చిత్రానికి నేను నిర్మాత అవ్వడం నా అదృష్టం.

ఇంత మంచి చిత్రాన్ని చేసే అవకాశం ఇచ్చిన హీరో, దర్శకుడికి నా ధన్యవాదాలు.

అలాగే ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు డబుల్ థ్యాంక్స్.

ఇండస్ట్రీ హిట్ సాధించిన ‘మగధీర’ నిర్మాణంలో నాకూ ఓ భాగం ఉంది.

ఇప్పుడు నిర్మించిన ‘అత్తారింటికి దారేది’ కొన్ని ఏరియాల్లో ‘మగధీర’ను క్రాస్ చేసింది.

మిగతా ఏరియాల్లో కూడా అధిగమిస్తుందనే నమ్మకం ఉంది.

అన్ని థియేటర్లలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోంది.

బీవీయస్‌యన్ ప్రసాద్

Filed Under: Pawan KalyanFeatured