ఇప్పుడు నందమూరి వారి టర్న్

NTR

అత్తారింటికి దారేది సినిమా పైరసీ జరగపోయి వుంటే, ఆ సినిమా కోసం ఇంకా ఎదురుచూస్తూనే వుండే వాళ్ళం. దేవుడి దయ వల్ల దర్శక నిర్మాతలే కాదు, ఆ సినిమా కోసం పని చేసిన టీమ్ & మెగా అభిమానులు కూడా ఏమి దిక్కు చెయ్యాలో తెలియని పరిస్థితి నుండి బయటపడ్డాం.

ఇప్పుడు మన పరిస్థితి, నందమూరి అభిమానులకు, నందమూరి వారి సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ వారికి షిప్ట్ అయ్యింది. నిర్మాత దిల్ రాజు మా సినిమా అక్టోబర్ 10నే రిలీజ్ చేస్తాం అని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా, ఆ టైమ్‌కు ఈ దిక్కుమాలిన గొడవలు ఏ టర్న్ తీసుకుంటాయోనని టెన్షన్‌తో పాటు చందా రాయుళ్ళ బెదిరింపులు ఒకటి.

ఈ ట్రైలర్స్ చూస్తుంటే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలా వుంది కాని, ఎప్పుడు చూస్తామో అనే టెన్షన్ మైండ్‌లో వుండటం వలన ఫుల్‌గా ఎంజాయ్ చేయలేకపోతున్నాం.

ప్రజలు నిస్సాహాయులు .. ఇటువంటి పరిస్థితులలో కూడా నిజం మాట్లాడకుండా ఇంకా డ్రామాలు ఆడాలని చూస్తే మనిషిగా పుట్టి వేస్ట్ ..

అభివృద్ది చెందిన హైదరాబాద్ తమ ప్రాంతంలో పెట్టుకొని ప్రత్యేక రాష్ట్రం అనే డిమాండ్ తప్పు. ఒక్క లుచ్చా సీమాంధ్ర నాయకుడు కూడా ఖండించలేదు .. మేమిస్తాం మేము సపోర్ట్ ఇస్తాం అని పోటిపడి, ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం ఎంత వరకు సబబు?

ప్లేటు ఫిరాయిస్తే సరే .. ఒక పార్టీలోనే అక్కడ నాయకులు అక్కడ మాట .. ఇక్కడ నాయకులు ఇక్కడ మాట .. ముష్టి వెధవలు

సీమాంధ్రుల ప్రజల్లో సీమాంధ్ర నాయకులు ఎక్కించిన కుల పిచ్చి వలనో,
ఒక కులం వ్యతిరేకత మీదనో,
నాయకులు అలవాటు చేసిన డబ్బో తీసుకుని
ఆ లుచ్ఛా నాయకులకే మన లాంటి నిస్సాహాయులు గెలిపించారు.

ఇండైరక్ట్‌గా తెలంగానకు ఒప్పుకున్నాం.

ఆలాంటి మనకు ఇప్పుడు రాష్ట్ర విభజనను వ్యతిరేకించే అర్హత ఎక్కడిది?

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇమ్మని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి,
తన దృష్టిలో న్యాయం అనిపిస్తున్నది కేంద్రం చేస్తుంటే కేంద్రాన్ని విమర్శించడం ఎంత వరకు కరెక్ట్?

విభజన వలన మనకు జరిగే నష్టాలను చెప్పుకోకుండా,
వాటి పరిష్కారానికి మార్గాలు అన్వేషించకుండా,
ఇంకా సమైక్యాంధ్ర అనటం ఎంత వరకు కరెక్ట్?

“హైదారాబాద్ మాకు కూడా చెందినది .. మాది కాకుండా చెయ్యడానికి మేము ఒప్పుకోం .. ” అని పొరాడే నాయకుడుకు సపోర్ట్ చెయ్యలని వుంది .. ఒక్కడు కూడా లేడు .. అందరూ సమైక్యాంధ్ర అని మోసపూరిత ఉద్యమ నాయకులే ..

ఇంకా తెలంగాన వాళ్ళను మోసం చేద్దామనే ఆలోచనతో, మనం ఏమి నష్టపోతున్నామో మన నాయకులకు తెలియడం లేదు ..

కేవలం పదేళ్ళు మాత్రమే ఉమ్మడి రాజధాని, ఆ తర్వాత మీది కాదు .. అని అంటున్న కేంద్రం తీర్పును గట్టిగా వాదించే నాయకుడే లేని ప్రాంతం సీమాంధ్ర .. సిగ్గు చేటు.

ఇదే సంధర్భంగా
తెలంగాన వచ్చేస్తే ఓవర్‌నైట్ ఎదో అయిపొతామనో, మున్ముందు ఎదో అయిపొతామనో అనుకుంటున్న పిచ్చి తోటి నిస్సాహాయ తెలంగాన ప్రజలకు సానుభూతి ..

Filed Under: Extended Family