ఏప్రిల్ 5న ఎన్.టి.ఆర్ ‘బాద్ షా’

Screen Shot 2013-01-13 at 1.58.52 PM

జూనియర్ ఎన్.టి.ఆర్, డైరక్టర్ శ్రీనువైట్ల కలయికలో వస్తున్న ‘బాద్ షా’ చిత్రం విడుదల తేదీ ఖారారైంది. పరమేశ్వర ఆర్ట్ ప్రొ డక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. జనవరి 16 నుంచి జరిగే షెడ్యులుతో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తికానుంది. మార్చి 10న పాటలను ఘనంగా విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. చిత్రంలో ఎన్.టి.ఆర్ సరసన కాజల్ నటిస్తోంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్.టి.ఆర్ ఇమేజ్ కు తగినట్టుగా యాక్షన్, ఎమోషన్, ఎంటరటైనమెంట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. — ఈనాడు పత్రిక

రామ్ చరణ్ క్లాప్ కొట్టిన ఈ చిత్రం ఆడియో పవన్ కళ్యాన్ చేతుల మీదగా రిలీజ్ చెయ్యడానికి నిర్మాత బండ్ల గణేష్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

అల్లు అర్జున్ ‘ఇద్దరు అమ్మాయిలతో’ సినిమా, ఏప్రిల్ 5కు ముందు మార్చి నెలాఖురుకు వుంటుందా? ఏప్రిల్ 5కు తర్వాత ఏప్రిల్ నెలాఖురుకు వుంటుందా? అనేది తెలియవలసి వుంది.

Filed Under: Extended Family