స్పీడ్ పెంచిన ఎన్.టి.ఆర్

ntr

ఎన్.టి.ఆర్ నార్మల్ గా స్పీడ్ గానే సినిమాలు చేస్తాడు కానీ, ఎందుకో ఈ మధ్య స్లో అయ్యాడు. ఆ స్లోను కవర్ చెయ్యడానికి మళ్లీ స్పీడ్ పెంచినట్టు అనిపిస్తుంది.

2013 ఏప్రిల్ లో ‘బాద్ షా’ రిలీజ్ కు సిద్దం అవుతుంది.

గబ్బర్ సింగ్ తో స్టార్ డైరక్టర్ గా మారిన హరీష్ శంకర్ దర్శకుడిగా దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా జూలై 9 రిలీజ్ టార్గెట్ తో పాస్ట్ గా షూటింగ్ జరుగుతుంది.

ఈ రెండిటితో పాటు మూడో సినిమా కూడా స్టార్ట్ అయ్యింది. కందిరీగ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమా దర్శకత్వం వహించడం విశేషం.

హరీష్ శంకర్ సినిమా అనుకున్న టైం జూలైలో వచ్చేస్తే ఈ సంవత్సరంలో ఎన్.టి.ఆర్ మూడు సినిమాలు వస్తాయి.

Filed Under: Extended Family