ఇదేమి ట్విస్ట్ – దూసుకెళ్తా అక్టోబర్ 11

Doosukeltha-Stills-04

హరీష్ శంకర్ అని ఒక దర్శకుడు ఉన్నాడని చాలామందికి తెలియదు. పవన్ కల్యాణ్ నెక్స్ట్ సినిమాకు రాంగోపాలవర్మ ‘షాక్’ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ అనగానే హరీష్ శంకర్ ఆటో బయోగ్రఫీ కోసం వేట మొదలైంది. ఆ సినిమా కథ పవన్ కల్యాణ్ అంగీకరించక పొవడం వలన, రవితేజతో ‘మిరపకాయ్’ గా మన ముందుకు వచ్చి కమర్షియల్ హిట్ సాధించిన విషయం మనకు తెలిసిందే.

ఇప్పుడు అదే కోవలో వస్తున్న చిత్రం వీరు పోట్ల “దూసుకెళ్తా” అనుకుంట.(not sure .. just guessing). అప్పట్లో పవన్‌కల్యాణ్‌తో వీరు పొట్ల సినిమా అనే వార్తలతో, కథ తనకు సరి కాదని పవన్ కల్యణ్ చెయ్యడం లేదనే వార్తలు కూడా వచ్చాయి.

వీరు పొట్ల నాగార్జునతో ‘రగడ’ సినిమా తీసాడు. ఈ సినిమా అనుకున్నంత హిట్ కాకపొయినా, అంతకు ముందు మనోజ్‌కు బిందాస్ అనే మంచి హిట్ ఇచ్చాడు.

అత్తారింటికి దారేది సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో .. అసలు రిలీజ్ అవుతుందో లేదో .. అని జనాలు పూర్తిగా సినిమాను మరిచి పోతున్న సమయంలో .. సినిమా అరవై నిమిషాలు విడియో బయటకు వచ్చేసి ఎమర్జన్సీగా రిలీజ్ చెయ్యడం జరిగింది. ఉద్యమం తీవ్రతను సానుభూతి డామినేట్ చేసి, మంచి ఓపినింగ్స్ సాధించుకుంటుంది. ఆ సానూభూతి దెబ్బకు చందా రాయుళ్ళు కూడా నోరు మూయవలసిన పరిస్థితి వచ్చింది.

అత్తారింటికి దారేది కొచ్చిన ఉద్యమం ముప్పు, చందా రాయుళ్ళ బెదిరింపులు ఇప్పుడు అక్టోబర్ 10 న రాబోతున్న రామయ్యా వస్తావయ్యా వైపు మళ్ళాయి.

రామయ్యా వస్తావయ్యా అక్టోబర్ 10 న రాదనుకుంటున్నారో, వాళ్ల సినిమా మీద నమ్మకమో దూసుకెళ్తా అక్టోబర్ 11 అని ఎనౌన్స్ చేసారు. రామయ్యా వస్తావయ్యాకు థియేటర్స్ ఇబ్బంది కలిగించే పరిస్థితే.

— మంచు విష్ణు హీరోగా బిందాస్‌, రగడ చిత్రాల దర్శకుడు వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దూసుకెళ్తా’. లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఆరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 11న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకొంది. ఈనెల 28న పాటల్ని వినిపిస్తారు.

Filed Under: Extended FamilyFeatured