‘oh my God’ ఎటువంటి రీమేక్?

venky-pawan-oh-my-god-it-is-confirmed

పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ కలిసి నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ హిరోలిద్దరకూ నచ్చే కథ దొరక్క, ఆ సినిమాను తీసే నిర్మాతలు లేక అది వాస్తవ రూపం దాల్చలేదు.

బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రం ‘ఓ మై గాడ్‌’ ను సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తెలుగులో రీమేక్ చేస్తుంది. పవన్‌కల్యాణ్ వెంకటేష్ కలిసి నటిస్తున్నారంటే లేనిపొని భారీ అంచనాలు వుంటాయి. ఆ సినిమా ప్రేక్షకులు ఆశీంచే మల్టీస్టారర్ స్థాయి కాకపొయినా, ఇందులో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చేసిన శ్రీ కృష్ణుని పాత్రలో పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ చేసిన ఓ సాధారణ వ్యాపారి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు.

భారీ అంచనాలు బ్రేక్ చేస్తూ ఇలా రీమేక్ ఎంచుకొవడం సేఫ్. ప్రేక్షకులు కచ్చితమైన అంచనాలతో వస్తారు.అయితే ఈ రీమేక్ ఎలా వుండబోతుందనే ప్రశ్న మొదలైంది. 100% కాపీ చేసేస్తారా? లేక భారీ హిట్ చెయ్యడానికి భారీ మార్పులు చేస్తారా?

భారీ మార్పులు అంటే అసలు కథ మిస్ అవ్వకుండా రిపీట్ ఆడియన్స్ రావడానికి కావాల్సిన అంశాలు కలపడం.

కాకపొతే మార్పులు చేయగలరా? అనే సందేహం కూడా వుండటం విశేషం.

Filed Under: Pawan KalyanFeatured