ఒక మనసు – 4 days to go

4 days to go

మెగా హీరోయిన్ కొణిదెల నీహారిక వెండితెర తెరంగేట్రం చేస్తూ నటించిన చిత్రం “ఒక మనసు”. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి “మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు” ఫేమ్ రామరాజు దర్శకత్వం వహిస్తున్న విషయాలు అందరికీ తెలుసు. జూన్ 24 న రిలీజ్ అవుతుంది. ఇంకా నాలుగు రోజులు వుంది. హిరో హిరోయిన్లు మీడియా ముందుకు వచ్చి, బాగా పబ్లిసిటీ చేస్తున్నారు. సినిమాలో హిరో హిరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్టు వుంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే, క్లాస్ హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. క్లాస్ సినిమా కావడంతో హైప్ లేకపొయినా, హిట్ అయ్యి మౌత్ టాక్ బాగుంటే మంచి కలక్షన్స్ వచ్చేట్టు వున్నాయి. మొన్న వారం వచ్చిన నాని జెంటెల్‌మేన్ సినిమాకు కూడా హైప్ లేకపొయినా, మంచి మౌత్ టాక్‌తో మంచి కలక్షన్స్ సాధిస్తుంది. ఈ సినిమా ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.

Filed Under: Featuredఒక మనసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *