కళ్యాణ్‌రామ్ ‘ఓం’ హిట్ అవ్వాలి

kalyan-ram

కొత్తదనం కోసం తపించే హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. సురేందర్ రెడ్డిని పరిచయం చేస్తూ ‘అతనొక్కడే’ నిర్మాతగా ఆయన తొలి చిత్రం. ఇప్పుడు సునీల్‌రెడ్డి దర్శకత్వంలో దేశంలోనే తొలి యాక్షన్ 3డి మూవీగా నిర్మించారు కళ్యాణ్‌రామ్. నిర్మాతగా, నటునిగా ఆయన చేసిన మరో వినూత్న ప్రయత్నం ‘ఓం’. ఈ నెల 28న ‘ఓం’ విడుదల కానుంది.

కృతి కర్బంద, నికిషా పటేల్ నాయికలుగా నటించిన ఈ చిత్రంలో కార్తీక్, సురేష్ కీలక పాత్రలు పోషించారు. రావురమేష్, రఘు, సితార ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అచ్చు, సాయికార్తీక్, కెమెరా: అజయన్ జోసఫ్ విన్సెంట్, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాణం: ఎన్టీఆర్ ఆర్ట్స్.

ఎంతో ఖర్చు పెట్టి సినిమా అంటే పిచ్చితో తెలుగు ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలనే కళ్యాణ్‌రామ్ ప్రయత్నంను ఎంకరేజ్ చెయ్యడానికి ‘ఓం’ హిట్ అవ్వాలి. ఈ సినిమా హిట్ అయితే నిర్మాతలు మరికొన్ని కొత్త ప్రయత్నాలు చెయ్యడానికి సాహసిస్త్తారు.

Filed Under: Extended FamilyFeatured