ఒంగోలు గిత్త లో ఒక సాంగ్ భలే వుంది

ongole_gitta

ఆరెంజ్ సినిమాతో ఆర్దికంగా బాగా నష్టపోయింది ఆ సినిమా నిర్మాత నాగేంద్రబాబు. మానసికంగా నష్టపోయింది హిరో రామ్ చరణ్ & దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్.

ఆరెంజ్ సినిమా ప్రభావమో లేక ఆ సినిమా ద్వారా గడించిన అనుభవంతోనో హిరో & దర్శకులిద్దరూ U టర్న్ తీసుకొని పక్కా మాస్ ఫిలిం వైపు దృష్టి పెట్టారు.

‘రచ్చ’ సినిమా విజయంతో రామ్ చరణ్ విజయం సాధించి ఊపిరి పీల్చుకుంటే, ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ వంతు వచ్చింది.

పక్కా మాస్ టైటిల్ తో వస్తున్న ‘ఒంగోలు గిత్త’ సాంగ్స్, రామ్ చరణ్ ‘రచ్చ’ సినిమా మాదిరి ఫుల్ మాస్ సాంగ్స్ వున్నాయి.

ఒక సాంగ్ భలే వుంది. పవన్ కల్యాణ్ పంజా సినిమాలో ‘పాపారాయుడు’ సాంగ్ మాదిరి వుంది. కాన్సప్ట్ అదుర్స్. పిక్చరైజేషన్ కూడా బాగుంటే మంచి కచ్చితంగా మాస్ ఆకట్టుకునే కాన్సప్ట్.

Filed Under: Extended Family