పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక నిజం

pawan-kalyan-s-panjaa

నేను పవన్ కళ్యాణ్ ను అభిమానించడానికి చాలా కారణాలు వున్నాయి. అదే విధంగా నాకు నచ్చని విషయాలు కూడా వున్నాయి. నచ్చని విషయాల గురుంచి పెద్ద పట్టించుకొను, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా మనిషే కదా!

పవన్ కళ్యాణ్ గురుంచి నీకు ఎలా తెలుసంటే ఆయన ఇంటర్వ్యూల ద్వారానే. ఈ క్రింది విషయం ఎక్కడ చదివానో, విన్నానో గుర్తు లేదు కాని విషయం మాత్రం గుర్తు వుంది.

తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి. వరసగా నలుగురు కొత్త దర్శకులని తెలుగు పరిశ్రమకు పరిచయం చేసారు. మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారా ? అని పవన్ కళ్యాణ్ ను అడిగితే “నాతొ సినిమా తియ్యడానికి ప్రముఖ దర్శకులు ముందుకు రాలేదు, నాకు కథ నచ్చి కొత్త వారికి అవకాశం ఇచ్చాను తప్ప, నా గొప్పతనం ఏమీ లేదు” అని సమాధానం చెప్పాడు.

ఎంత మంది హిరోలు ఇలా ఓపెన్ గా నిజాన్ని ఒప్పుకోగలరు?

Filed Under: Pawan Kalyan

Tags: