త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు మాత్రమే సాధ్యం

attarintiki-daredi-movie-audio-release-function-photos-63dc47fc

We request Trivikram not to make commercial MASS movies because if he starts making those movies, we need to pack our bags..so please stick to class movies only

Tollywood NO 1 Director Raja Mouli

యాక్టర్ ఒక క్యారెక్టర్‌లో నటిస్తే సరిపోతుంది. ఒక డైరక్టర్ సినిమాలో అన్నీ క్యారెక్టర్స్‌లో నటించి చూపించాలి. డైరక్టరే ఆ సినిమా కథా రచయిత అయితే, ప్రతి క్యారెక్టర్ డిజైన్ కూడా చెయ్యాలి.

–దాసరి నారాయణ రావు

“అత్తారింటికి దారేది” విజయంలో ఎవరికెన్నెన్ని % of మార్కులు ఇస్తారని అడిగితే ఒక్కొక్కరు ఒకో సమాధానం ఇస్తారు.

ఒక సమాధానం:
100 మార్కులు త్రివిక్రమ్‌కే

మరి పవన్‌కల్యాణ్‌కు మార్కులు ఏమి లేవా? అని డౌట్ రావచ్చు.
తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి , గుడుంబా శంకర్ & గబ్బర్‌సింగ్ .. లో దానికంటే ఏమైనా ఎక్కువ చేసాడా ? .. Answer is NO.

గబ్బర్‌సింగ్ సినిమాలో పవన్‌కల్యాణ్‌ను కరెక్ట్‌గా ఎలా ప్రెజెంట్ చెయ్యాలో హరీష్ శంకర్ చూపిస్తే, దాన్ని ఎక్జాట్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫాలో అయ్యాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ గొప్పతనం ఏమిటంటే, సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన విధానం. ఒక చిన్న సెంటిమెంట్ కథను పూర్తి వినోదత్మాకంగా చెప్పిన తీరు. It is only Possible to Trivikram Srinivas. అందుకే మొత్తం క్రెడిట్ అంతా త్రివిక్రమ్‌కే.

idlebrain jeevi ‏@idlebrainjeevi 27 Sep
Trivikram wrote it in such a way that there is logic behind every seemingly illogical scene in the movie #atharintikidaredi

ఒక సినిమాకు పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ నిజంగా పెద్ద ఛాలెంజ్.

నిర్మాత బాద్యత సినిమాకు ఖర్చు పెట్టడం, వ్యాపారం చేసుకొవడంతో తీరిపోయిందనుకో కూడదు. డైరక్టర్‌తో కలిసి ప్రమోషన్ కార్యక్రమాలు డిజైన్ చేసి, సినిమాను మరింత మంది చూసేలా చేస్తే బాగుంటుంది.

ఈ సినిమా పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కోసం పడిన కష్టం రోజుకో ఎపిసోడ్‌గా చెపితే చాలు. జనాలు illogical scenes గా ఫీల్ అవుతున్న వాటికి సమాధానం చెప్పినట్టు కూడా వుంటుంది.

Filed Under: Pawan Kalyan