ఊపిరి – Exclusive Review

Oopiri

ఊపిరి సినిమా చూడవచ్చా?
కొన్ని సినిమాలు చూడొచ్చా చూడకూడదా అని లెక్కలేసుకోకూడదు, తప్పకుండా చూడాలి. అటువంటి సినిమాల్లో ఊపిరి సినిమా ఒకటి.

కమర్షియల్ సక్సస్ సాధిస్తుందా?
పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయా రావా అనే కోణంలోనే నిర్మాత సినిమాలు తీస్తాడు. వచ్చే విధంగానే పైడిపల్లి వంశీ తీసాడు. క్లాస్ ఓరియంటడ్ సినిమా కావడంతో, రికార్డ్ స్థాయిలో రాకపోవచ్చు. మాస్ ప్రేక్షకులు సెంటిమెంట్ ఎక్కువైంది అంటారెమో. సుడి బాగుంటే కలక్షన్స్ రికార్డ్ స్థాయిలో కూడా రావోచ్చెమో. రికార్డ్ కలక్షన్స్ వచ్చినా రాకపొయినా, పి.వి.పి బ్యానర్‌ స్థాయిని పెంచే సినిమా.

ఎవరి సినిమా?

  1. పైడిపల్లి వంశీ
  2. కార్తీ
  3. నాగార్జున

కార్తీ పూర్తిగా డామినేట్ చేసాడు. నాగార్జున కాకపొతే సినిమాకు ఇంత గుర్తింపు వచ్చేది కాదు. పైడిపల్లి వంశీ, క్లాస్ ప్రేక్షకులకు అసలు ఎక్కడా బోర్ లేకుండా మొదటి నుంచి చివరి దాకా నడిపించాడు.

తమిళ్ ప్రేక్షకులకు నచ్చుతుందా?
ఎన్.టి.ఆర్ మంచి మూవీ మిస్ అయ్యాడు. ఎన్.టి.ఆర్ చేసి వుంటే, తెలుగులో ఇంకా పెద్ద సినిమా అయ్యేదెమో. ఎన్.టి.ఆర్ ప్లేసులో కార్తీ వచ్చి, తమిళ్ మార్కెట్ యాడ్ చెయ్యడంతో పాటు పైడిపల్లి వంశీని తమిళ్‌కు పరిచయం చేసాడు. అటు నటనా పరంగా కూడా ఇరగదేసేసాడు. తమిళ్ ప్రేక్షకులకు కూడా నచ్చే సినిమానే. నచ్చకపొవడానికి ఏమీ లేదు.

Filed Under: FeaturedHari Reviews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *