ఓవర్‌సీస్ ఆల్ టైమ్ నెం 1 చిత్రంగా అత్తారింటికి దారేది

Pawan Kalyan

సమైక్యాంధ్ర ఉద్యమం ఎఫ్టెక్ట్ తో విడుదల వాయిదా పడుతూ వస్తున్న అత్తారింటికి దారేది చిత్రం పైరసీ సీడీలు కృష్ణా జిల్లా పెడన లో బయటపడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

అత్తారింటికి దారేది అక్టోబర్ 9 తేదిన దసరా కానుకగా విడుదల చేయాలని తొలుత సినీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నా, ఉద్యమాల వేడి తగ్గే సూచనలు లేకపొవడంతో ఆ డేటు కూడా డౌటే అనుకుంటున్న సమయంలో.. ఈ చిత్రం సీడీల రూపంలో బయటకి రావడంతో సినిమాను సెప్టెంబర్ 27 తేది శుక్రవారం అంటే ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. జల్సా తర్వాత పవన్ కళ్యాణ్, రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కు ఓవర్‌సీస్ కింగ్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తోడవ్వడంతో ఈ సినిమా ఆల్ టైమ్ నెం 1 చిత్రంగా నిలుస్తుందని ఎక్సపెట్ చేస్తున్నారు. టిక్కెట్ రేట్లు డబుల్ చేసినా, ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు తప్ప, వెనక్కి తగ్గడం లేదు.

హిరో పాల్స్ ప్రేస్టేజ్, నిర్మాత దురాశలకు అభిమానులు, సినిమా పిచ్చోళ్ళు బలి అవ్వక తప్పడం లేదు.

పైరసితో నష్టపోతున్నాం అని సోది కబుర్లు చెపుతూ, మొదటి రోజు చూసే అభిమానులు & సినిమా పిచ్చోళ్ళపై అదనపు భారం వేసేస్తున్నారు. ప్రత్యేకంగా అమెరికాలో దారుణం.

ఒక సినిమా విజయానికి:
ఒక సినిమాకు ఎన్ని టిక్కెట్లు కట్ అయ్యాయి?(including repeat audience)
or
ఒక సినిమాను ఎంతమంది చూసారు?(excluding repeating audience)

అనేవి కొలబద్దగా వుండాలి. కాని రికార్డుల పేరుతో అభిమానులు, సినిమా పిచ్చోళ్ళ దగ్గర నుండి ఎంత గుంజుకున్నాం అనే ట్రెండ్ మొదలయ్యింది. ప్రతి వారం ఫ్యామిలీతో సినిమాకు వెళ్ళ వలసిన తెలుగు ప్రేక్షకులు, చాలా పరిమితంగా థియేటర్స్‌కు వస్తున్నారనే సత్యాన్ని విస్మరిస్తున్నారు.

Filed Under: Pawan KalyanFeatured