పవన్-త్రివిక్రమ్‌ నిర్మాతలుగా సినిమాలు

pktrivikram

జనాలందరూ రెడీగా వున్న “అత్తారింటికి దారేది” ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా విడుదల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్, అప్పుడు రిలీజ్ అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు గెస్ చేస్తున్నారు కాని, నిజానికి ఈ సినిమా ఎప్పుడు రిలీజో దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు.

మొన్న పవన్-త్రివిక్రమ్‌ కలయికలో మరో సినిమా “కోబలి” వస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

పవన్‌కల్యాణ్ తన పేరిట ‘పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ అనే సంస్థను స్థాపించి సొంతంగా సినిమాలను నిర్మించనున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే… ఆ విషయాన్ని పవన్ ప్రస్తుతం పక్కన పెట్టేసి త్రివిక్రమ్‌తో కలిసి సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రతిభావంతులను పరిశ్రమకు పరిచయం చేయడమే లక్ష్యంగా వీరి నిర్మాణ సంస్థ సాగుతుందని తెలుస్తోంది. వీరు ప్రారంభించనున్న నిర్మాణ సంస్థకు తగ్గ కార్యాలయాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Filed Under: Pawan KalyanFeatured