కాపులను రాజులను అవమానిస్తున్న పవన్‌కల్యాణ్

RGV

Ram Gopal Varma ‏@RGVzoomin
@PawanKalyan All common sensical and truly self respecting Kaapus and also including our Rajus hate ur vinnapams

ఎన్నికల్లో ఓట్ల కోసం చేసిన వాగ్దానాలను సిరియస్‌గా తీసుకొని, “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తాం అన్నారు కదా, రెండు సంవత్సరాలు అయిపొయాయి, ఇవ్వలేకపొతే ఇవ్వలేము అని చెప్పండి కాని, సాగతీసే ధోరణి అవలింభించవద్దు” అని మొన్నెప్పుడో పవన్‌కల్యాణ్ అన్నట్టు వున్నాడు. దానికి సమాధానంగా పవన్‌కల్యాణ్‌ను గౌరవిస్తూ, మేము ఇవ్వలేము, ఆ స్పెషల్ స్టేటస్ ప్లేసులో ఎదో ఇస్తాం అని స్పష్టంగా చెప్పారు.

మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకో పొతే, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పట్టిన గతే బి.జె.పి కి పడుతుందని, బి.జె.పి కి ఆ గతి పట్టకూడదని, బి.జె.పి స్పెషల్ స్టేటస్‌పై తీసుకున్న నిర్ణయం మరోసారి ఆలోచించుకొవాలని పవన్‌కల్యాణ్ ట్వీటర్లో ఒక విన్నపం చేసాడు.

పవన్‌కల్యాణ్ విన్నపాలు చేయకూడదు, సినిమాలో పవన్‌కల్యాణ్ హిరోగా వార్నింగ్‌లు ఇచ్చినట్టే, ట్విటర్లో కూడా ఇవ్వాలని రాంగోపాలవర్మ అంటున్నాడు. ఇలా విన్నపాలు ఇవ్వడం ద్వారా పవన్‌కల్యాణ్ వీపరీతంగా అభిమానించే కాపు కులస్థులను పవన్‌కల్యాణ్ అవమానించాడని రాంగోపాలవర్మ అంటున్నాడు.

రాంగోపాలవర్మ పవన్‌కల్యాణ్‌ను అభిమానిస్తాడు కాబట్టి, రాంగోపాలవర్మను అభిమానించే రాజు కులస్థులంతా పవన్‌కల్యాణ్ ను అభిమానిస్తారు. ఆ విధంగా పవన్‌కల్యాణ్‌ను అభిమానించే రాజు కులస్థులను కూడా అవమానించాడని రాంగోపాలవర్మ అంటున్నాడు.

bottomline:
frustrated RGV తన ట్వీట్స్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు అర్దం చేసుకునే సౌకర్యం కల్పిస్తాడు. He is not just frustrated RGV. He is frustrated GENIUS. మరో కోణంలో తెలివైన పిరికోడు అని అనుకొవచ్చు.

గమనిక: ఏ ఒక్కరినీ కించపరచాలనే వుద్దేశం పవన్‌ఫ్యాన్స్.కామ్ కు లేదు. చేయవలసిన అవసరం అంత కన్నా లేదు. అర్దం చేసుకొండి. అపార్దం చేసుకోవద్దు. (We don’t care. But ఓరేయ్ .. గిరేయ్ .. పిచ్చ నాకొడకా .. లఫూట్ గా .. అని కామెంట్స్ చేస్తున్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ గమనిక పెట్టడం జరిగింది)

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *