పవన్ కళ్యాణ్ & పవన్ ఫ్యాన్స్ చిరంజీవికి గౌరవం ఇవ్వడం లేదా?

chiru-pk

ఈ మధ్య ఆడియో ఫంక్షన్స్ సినిమా పబ్లిసిటికి చాలా చాలా ఉపయోగ పడుతున్నాయి. రొటీన్ గా కూడా అనిపిస్తున్నాయి. వారసుల ఫంక్షన్స్ అయితే, వంశంల గోల ఎక్కువైంది. ఎవరి వంశం గోల, ఆ వంశంకు & ఆ వంశం ఫ్యాన్స్ కు తెలియదు కాదు కాని, వేరే వాళ్ళకు క్లియర్ గా తెలుస్తూ వుంటుంది. ఈ ఆడియో ఫంక్షన్ లేకపోయినా బాగానే వుండును అనిపిస్తూ వుంటుంది.

పవన్ కళ్యాణ్ సినిమా ఆడియోకు అన్నయ్య వస్తే చాలా బాగుండేది. కాని నిన్న ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ చిరంజీవి పేరు కూడా ప్రస్తావించక పోవడంతో కొందరు మెగా అభిమానులు నిరాశ చెంది, చిరంజీవికి ఎదో అవమానం జరిగినట్టుగా ఫీల్ అవుతున్నారు. చిరంజీవి లేకపొతే పవన్ కళ్యాణ్ లేడన్న విషయం పవన్ కళ్యాణ్ కు తెలుసు. బుర్ర వున్న ప్రతి పవన్ ఫ్యాన్ కు తెలుసు.

చిరంజీవి పేరు అవసరం వున్నా లేకపోయినా తీసుకొనివచ్చి చిరంజీవిపై వున్న గౌరవాన్ని ప్రతిసారి చాటుకొవాల్సిన అవసరం లేదు. ఎక్కువ యూజ్ చేసినా దానికి విలువ లేకుండా పోతుంది.

పవన్ కళ్యాణ్ & పవన్ ఫ్యాన్స్ కు చిరంజీవి గారిపై గౌరవం లేకపోవడం/ఇవ్వకపోవడం అనేది అసత్యం. చిరంజీవి కాంగ్రెస్ పై పోరాడ లేక కాంగ్రెస్ లో చేరినంత మాత్రానా చిరంజీవి అవినీతి పరుడు కాడు, చిరంజీవి ఎక్కడ వున్నా కష్టాన్ని నమ్ముకున్న చిరంజీవే అని పవన్ కల్యాణ్ కు & పవన్ ఫ్యాన్స్ కు తెలుసు .

Filed Under: Pawan KalyanFeatured