పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌

pawan

ఇన్నాళ్లూ తన సినిమాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ పవన్‌ తన ఇంటి నుంచే పర్యవేక్షిస్తూ వచ్చాడు. అయితే, ఇకపై అలాంటి కార్యక్రమాలను, తన కోసం వచ్చే సినిమా జనాన్ని ఆఫీసులోనే కలవాలని ఆయన నిర్ణయించుకున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

పవన్‌కల్యాణ్‌కి ఇప్పుడు ఓ మాంచి ఆఫీస్‌ కోసం హైదరాబాదు జూబ్లీహిల్స్‌లో అన్వేషణ కూడా మొదలుపెట్టాడు. తను నెలకొల్పిన సొంత నిర్మాణ సంస్థ ‘పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌’ కోసం ఓ ఆఫీసు తీయాలని నిర్ణయించుకున్నాడు. జూబ్లీహిల్స్‌ జర్నలిస్టు కాలనీ అంటే పవన్‌ ఇష్టపడుతున్నాడు. దాంతో, ఆ ప్రాంతంలోనే పవన్‌ అభిరుచికి తగ్గా ఆఫీసు కోసం ఆయన స్టాఫ్‌ వెతుకుతున్నారు.

ఈ బ్యానర్లో అవకాశం వచ్చే అదృష్టవంతులు ఎవరో, ఈ బ్యానర్ ఎటువంటి STANDARDS సెట్ చేస్తుందో చూడాలి.

Filed Under: Pawan KalyanFeatured