సరికొత్త కథతో పవన్‌కల్యాణ్ సినిమా మొదలు

Screen Shot 2014-02-21 at 11.34.40 PM

అందరూ ఊహించినట్టుగానే ‘గబ్బర్‌సింగ్ 2’ ఆటకెక్కింది. పవన్‌కల్యాణ్ ఇచ్చిన లైనుకు పవన్‌కల్యాణ్‌కు నచ్చే విధంగా కథ తయారు చెయ్యడంలో సంపత్ నంది ఫెయిల్ అయ్యాడు. so, పవన్‌కల్యాణే రంగంలోకి దిగి ఓ కొత్త కథాంశంతో మళ్ళీ మొదలు పెట్టాడు. కథ, రచన పవన్‌కల్యాణ్ పర్యవేక్షణలో జరగబోతుంది. దర్శకుడిలో మాత్రం మార్పు జరగలేదు.

అదే సమయంలో సినిమా ఆగిబోయిందన్న మీడియా వార్తలకు ఫుల్ స్టాఫ్ పెట్టడానికి, శుక్రవారం ఫిల్మ్‌నగర్ దేవాలయంలో పూజా కార్యక్రమాలు ముగించడంతో పాటు, వెంకటేశ్వర స్వామిపై చిత్రీకరించిన తొలి దృశ్యానికి సీనియర్ ప్రొడక్షన్ చీఫ్ ప్రకాశ్ కెమెరా స్విచాన్‌గా చేయగా, చిత్రనిర్మాత శరత్ మరార్ తండ్రి జీకే మరార్ క్లాప్ ఇచ్చారు. న్యాయవాది ప్రమోద్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

ఎదో దసరాకు రిలీజ్ అని ఎనౌన్స్ చేసారు కాని, కథ కూడా పూర్తిగా తయారు కాని ఈ సినిమా అంత తొందరలో రావడం ఇంపాజిబుల్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపొయారు. నిజంగా వస్తే ఫ్యాన్స్‌కు పండగే.

ఈ చిత్రానికి రచనా పర్యవేక్షణ: సత్యానంద్, క్రియేటివ్ హెడ్: హరీష్ పాయ్, రచనా సహకారం: శ్రీధర్ సీపాన, కిశోర్ గోపు, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: ఆనంద్‌సాయి.

ఈ కొత్త సినిమాకు పనిచేసే టీమ్‌లో మార్పు లేకపొవడంతో మీడియా ‘గబ్బర్‌సింగ్ 2’ అనే ప్రచారం చేస్తుంది. టైటిల్ ఎనౌన్స్ చేసే దాకా మనకు ఈ తిప్పలు తప్పవు.

Filed Under: Pawan KalyanFeatured