ఒకే దర్శకుడితో పవన్ కళ్యాణ్ రెండో సినిమా

Pawan-Kalyan-and-Trivikram

“అత్తారింటికి దారేది?” సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలోకి వస్తున్న కొద్ది అభిమానులలో లేనిపోని అనుమానాలు మొదలవ్వుతున్నాయి.

అభిమానుల అనుమానాల్లో ఒకటి:

భీమనేని శ్రీనివాసరావు – సుస్వాగతం తర్వాత అన్నవరం
కరుణాకరన్ – తొలిప్రేమ తర్వాత బాలు
పూరి జగన్నాధ్ – బద్రి తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు
యస్.జె. సూర్య – ఖుషి తర్వాత కొమరం పులి

ఫస్ట్ మూవీస్ అయినంత సక్సస్, ఒకే దర్శకుడితో పవన్ కళ్యాణ్ రెండో మూవీస్ కాలేదు.

ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జల్సా తర్వాత పవన్ కళ్యాణ్ రెండో సినిమా “అత్తారింటికి దారేది?” కూడా అదే బాటలో జల్సా అంత సక్సస్ కాదేమోనని కొందరు అభిమానులు అనుమానంతో బెంగ పెట్టుకున్నారు.

ఈ సెంటిమెంట్ ఫన్నీ అనిపించినా, అభిమానాలు బాదలు ఇలా వుంటాయి. అందుకే అభిమానాన్ని కొలవలేము. అభిమానులను ఆనందింపజేసే వాడే అసలైన హిరో.

Filed Under: Pawan KalyanFeatured