పవన్ కళ్యాన్- త్రివిక్రమ్ మూవీ టైటిల్ ‘B+’

B Positive

పవర్ స్టార్ పవన్ కళ్యా‌ణ్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. సమంతా మెయిన్ హిరోయిన్ కాగా, మరో హీరోయిన్ ప్రణీత ఈచిత్రంలో సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

నిర్మాత ‘అత్తారింటికి దారేది’ అనే టైటిల్ రిజిస్టర్ చేసారు కాని, ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదు. ఇదే అదనుగా వేరే టైటిల్స్ కూడా అనుకుంటున్నారని ఫిలిం నగర్ లో వినిపిస్తుంది. అందులో ఒకటి ‘B+’.

‘B Positive’ అని పిలుస్తారంట.. ‘Be Positive’ అని స్పూరిస్తూనే ‘రక్త సంబంధం’ అనే అర్దం కూడా దాగి వుందంట ఆ టైటిల్లో.

Filed Under: Pawan KalyanFeatured