వినాయక్ & పవన్‌కల్యాణ్ కాంబినేషన్‌లో మూవీ

Pawan Kalyan

వినాయక్ & పవన్‌కల్యాణ్ కాంబినేషన్‌లో మూవీ
or
శ్రీనువైట్ల & పవన్‌కల్యాణ్ కాంబినేషన్‌లో మూవీ
or
రాజమౌళి & పవన్‌కల్యాణ్ కాంబినేషన్‌లో మూవీ

రాకపొవడానికి కారణం వారి కాంబినేషన్‌ను భరించగల్గే నిర్మాత లేకపొవడం. సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే, ఆ కాంబినేషన్‌కు 25 కోట్లు పైనే పే చెయ్యాలి. దానయ్య నిర్మాతగా వినాయక్ & పవన్‌కల్యాణ్ కాంబినేషన్‌లో మూవీ ఇంతకు ముందే రావాల్సి వుండే. ఎందుకో వర్కవుట్ కాలేదు. గీతా ఆర్ట్స్ చేస్తుందెమోనని వినాయక్ పెట్టుకున్న ఆశలు ఫలించేలా కనిపించడం లేదు.

పవన్‌కల్యాణ్ చేయబోయే నెక్స్ట్ రెండు సినిమాలు
1) సంపత్ నంది దర్శకత్వంలో ఒకటి కాగా,
2) బలుపు నిర్మాతలు.

బలుపు నిర్మాతలు నిర్మించే సినిమాకు దర్శకుడెవరు అనేది ఇంకా ఎనౌన్స్ చేయ్యలేదు. మళ్ళీ మలినేని గోపిచంద్ తోనే తీస్తారా లేక పవన్‌కల్యాణ్ మాటిచ్చి ఇంకా తీర్చుకొని దర్శకుడితో చేస్తారా అనేది తెలియదు. వినాయక్ & పవన్‌కల్యాణ్ కాంబినేషన్‌లో ఈ మూవీ వుండే అవకాశం కూడా వుంది.

ఇటువంటి దర్శకులతో చేస్తే, జస్ట్ లైను ఒప్పుకొని, మొత్తం దర్శకుడికి వదిలేసి, చాలా ప్రశాంతంగా రిలాక్సాడ్‌గా నటిస్తే చాలు.

వినాయక్, శ్రీను వైట్ల & రాజమౌళి ..
పది సంవత్సరాల క్రితమే పవన్‌కల్యాణ్ స్టామినా చూపించ గల అర్హత సంపాదించి, పవన్‌కల్యాణ్ దగ్గర నుండి ఎప్పుడు కాల్ వస్తుందా అని ఎదురు చూస్తున్న దర్శకులు.

రాజమౌళి బాహూబలితో బిజీ వున్నాడు, శ్రీనువైట్ల ఆగడుతో బిజీ. వినాయక్ బెల్లంకొండ కుమారుడి సినిమా ఫినిష్ చేసుకొని, పవన్ కల్యాన్ సంపత్ నంది సినిమా ఫినిష్ అయిపొయే టైంకు అందుబాటులోనే వుంటాడు. పవన్‌కల్యాణ్ వినాయక్‌తో చెయ్యాలనుకొవడమే లేటు.

Filed Under: Pawan KalyanFeatured