TALK రావడానికి ఒక్క WALK చాలు

Screen Shot 2013-07-14 at 9.50.25 PM

ఒకప్పటి హిరోలకు అభిమానులతో పాటు రికార్డుల పిచ్చి బాగా వుండేది. సూపర్ కృష్ణకు కొద్దిగా ఎక్కువ అనుకుంట. ఆయనను సంతృప్తి పరచడానికి మహేష్ బాబు కూడా రికార్డ్స్ పై దృష్టి సారిస్తాడు అనుకుంట. ఆ విషయాన్ని దూకుడు నిర్మాతలు బాగా క్యాచ్ చేసినట్టు వున్నారు. దూకుడు మగధీర ను నాలుగు వారాల్లో కొట్టేసిందని చెప్పడం, అది నిజం అనుకొని “Its Offical:” అని మహేష్ బాబు ట్విట్ చేయడం కూడా జరిగింది.

దూకుడు నిర్మాతలు “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” ఓవరసీస్ డిస్ట్రి బ్యుషన్ రైట్స్ తీసుకొని, ఆ సినిమా కలక్షన్స్ ఆఫీషియల్ గా రికార్డ్ అయ్యేట్టుగా చేసి, ఆ సినిమాను ఆఫిషియల్ ఓవర్సీస్ నెం 1 చిత్రంగా, ఎటువంటి అనుమానాలు లేకుండా చేసారు.

ఆ నిర్మాతలే ‘1’ చిత్రం టీజర్ ను, ఏవేవో జిమ్మిక్కులు చేసి అత్యధిక హిట్స్ వచ్చేలా చేసారని టాక్ వుంది. ఆ జిమ్మిక్కు రికార్డ్ ను బద్దలు కొట్టడానికి మెగా అభిమానులంతా ఏకమై తాము ఎన్నిసార్లు చూడగలరో అన్ని సార్లు ‘అత్తారింటికి దారేది’ టీజర్ ను చూస్తున్నారు. ఆ విధంగా ‘అత్తారింటికి దారేది’ టీజర్ వ్యూ కౌంట్ సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు.

ఇటువంటి పొటీ వాతావరణం లో “TALK రావడానికి ఒక్క WALK చాలు” అని హరీష్ శంకర్ ట్విటర్ లో చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి.

Filed Under: Pawan KalyanFeatured