సెప్టెంబర్ మొదటి or రెండో వారంలో “అత్తారింటికి దారేది?”

pawan

రచ్చ, నాయక్‌ సక్సెస్‌ల తర్వాత రామ్‌ చరణ్‌ హీరోగా, శ్రుతి హాసన్‌, అమీజాక్సన్‌లు హీరోయిన్లుగా.. మున్నా, బృందావనం చిత్రాలను అందించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అనిత సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు తెరకెక్కిస్తున్న చిత్రం ఎవడు.

ఎప్పుడో షూటింగ్ మొదలైన సినిమా చాలా కాలం పాటు సెట్స్ పై వుంది. ఇందులో ఓ ప్రత్యేకమైన పాత్రలో అల్లు అర్జున్‌, కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారు. ఓ వైవిధ్యమైన కథకి వినూత్నమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా దర్శకుడు వంశీ తీర్చిదిద్దాడు. ఈనెల 30న హైదరాబాద్‌లో దేవీశ్రీప్రసాద్‌ సంగీతమందించిన ఈ చిత్ర పాటల్ని విడుదల చేయనున్నారు.

మరో పక్క రామ్ చరణ్ మరో చిత్రం ‘జంజీర్’ కూడా ఫినిష్ అయిపోయి, రైట్ రిలీజ్ టైమ్ కోసం ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు.

ఎవడు జూలై నెలాఖారు లేదా ఆగష్టు మొదటి వారంలో రిలీజ్ అయితే, సెప్టెంబర్ మొదటి or రెండో వారంలో “అత్తారింటికి దారేది?” రిలీజ్ అవ్వడానికి అవకాశం వుంది.

evadu

Filed Under: Mega FamilyFeatured