ఈ సంవత్సరం ఇంకో సినిమా వుండదు

pk

పవన్‌కల్యాణ్ సపోర్ట్ చేసిన కేంద్రం కొత్త ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద హ్యాండ్ ఇచ్చింది. కేంద్రంపై ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పొరాడవలసిన సమయం ఇది. అన్నీ ప్రాంతాలను సమానంగా చూడవలసిన నాయకులు, తమ సొంత ప్రాంతాలకు కేంద్ర నిధులను తరలించుకుపోతుంటే ఎలా స్పందించాలో ఎక్కడ మొదలుపెట్టాలో తెలియని పరిస్థితి.

“గోపాల గోపాల” సినిమా క్యారెక్టర్ మూడ్ ఎక్కడ డిస్ట్రబ్ అవుతుందోనని 1) నితిన్ ఆడియో ఫంక్షన్‌కు రాలేదు. 2) వరుణ్ తేజ్ మొదటిసినిమా ఆడియో ఫంక్షన్ మిస్ కొట్టాడు. 3) ఎవరూ మిస్ కొట్టని “మేముసైతం” కు కూడా రాలేదు.

ఒక పక్క కేంద్రంపై పొరాటం చేస్తూ, మరోపక్క సినిమా చెయ్యగలడా?.. కష్టమే .. ఈ సవంత్సరం ఇంకో పవన్‌కల్యాణ్ సినిమా కష్టమే అంటున్నారు మెగా అభిమానులు.

రచ్చ ఫేం సంపత్‌నందితో చెయ్యవలసిన గబ్బర్‌సింగ్-2, పవర్ ఫేం బాబీ తో “సర్దార్” గా పవన్‌కల్యాణ్ చెయ్యాలనుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

“అసలు మొదలవుతుందా?” అనే సందేహాలు వున్న ఈ సినిమా ఈ సంవత్సరం రాదు అని మెగా అభిమానులు ఫిక్స్ అయిపొయారు.

Filed Under: Pawan KalyanFeatured