పవన్ vs చరణ్

pawan-charan

ఒకే ఫ్యామిలికి చెందిన హీరోలు అని కాదు, రెండు పెద్ద సినిమాలు ఒక వారం గ్యాప్ రిలీజ్ అయితే, రెండు సినిమాల కలక్షన్స్ పై ప్రభావం వుంటుంది. పండగ సీజన్ కూడా కాదు.

ఈగ సినిమాతో పోటి పడటం ఇష్టం లేక, అల్లు అర్జున్ తన సినిమా ‘జులాయి’ ని నెల రోజులు వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాన్ కూడా అలా చేద్దాం అంటే రామ్ చరణ్ మరో సినిమా ‘జంజీర్’ సెప్టెంబర్ 6న వుంది.

లాస్ట్ మినిట్ లో ఏమైనా మార్పులు జరిగితే చెప్పలేం కాని, as of now జూలై 31న ‘ఎవడు’ .. ఆగష్టు 7న ‘అత్తారింటికి దారేది’.

రిలీజ్ డేట్ కనఫార్మ్ కాలేదు కాబట్టి, ‘ఎవడు’ జూలై 24న వస్తుందేమో అని చిన్న ఆశ వుంది.

ఎవడు ఆడియో :
చాలా మంది ఇనిస్టెంట్ సాంగ్స్ లేవని పెదవి విరుస్తున్నారు కాని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కావాల్సిన అన్నీ సాంగ్స్ వున్నాయి. చిరంజీవి మాదిరి చరణ్ కూడా తన స్టెప్స్ తో సాంగ్స్ ను హై రేంజ్ కు తీసుకొని వెళ్ళగలడని ‘రచ్చ’ & ‘నాయక్’ సినిమాలు చూసాం. జాగ్రత్తగా పబ్లిసిటి చెయ్యవలసిన సినిమా. పబ్లిసిటి ఇంకా మొదలవ్వలేదని కొద్దిగా వర్రీగా వుంది. రిలీజ్ డేట్ కనఫార్మ్ అయిన తర్వాత చేస్తారెమో.

అత్తారింటికి దారేది:
పవన్ కల్యాణ్ కు తోడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కావడంతో పాటు ఫ్యామిలి ఓరింటడ్ మూవీ కావడంతో మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం ఇప్పటికే ప్రేక్షకుల్లో వుంది. ఆడియో టిజర్ వింటే ఫ్యాన్స్ ను బీభత్సం గా సాటిస్ఫై చెయ్యడం ఖాయం అనిపిస్తుంది.

bottom line:
‘అత్తారింటికి దారేది’ ఆగష్టు 7 మార్చాలని అలోచన రాకుండా, ఎవడు’ జూలై 24న వస్తే బాగుండు.

Filed Under: Pawan KalyanFeatured