పవన్ ఆ రూమర్ ని నిజం చేస్తాడా !

pawan1-e1348592566214

FM లో వచ్చే పాటలు విని అది ఏ సినిమాలో పాటో అన్నిసార్లు correct గ చెప్పడం కష్టమే కాని పవన్ కళ్యాణ్ సినిమా పాటలకి వచ్చే సరికి ఆ సమస్య ఉండదు.ఇక రమణ గోకుల్ ,పవన్ కాంబినేషన్ లో వచ్చిన తమ్ముడు,బద్రి ,జాని సినిమాలో పాటలు అయితే చాలా ఫ్రెష్ గ ఉంటాయ్ అనడంలో సందేహం లేదు.ఎంతో మంది హీరోస్ కి బెస్ట్ హిట్స్ ఇచ్చిన మణిశర్మ  ఖుషి ,బాలు  లాంటి మంచి ఆల్బమ్స్ పవన్ కళ్యాణ్ కి ఇచ్చాడు .

 TollyWood లో ప్రస్తుతం టాప్ లో ఉన్నమ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ . జల్సా లాంటి కత్తి లాంటి ఆల్బమ్ ఇచ్చినా, అలాంటి ఆల్బమ్స్ ప్రతీసారి రావాలి అంటే కొంచెం కష్టమే. తమ్మన్ ,మిక్కి లాంటి వాళ్ళు ఆల్రెడీ prove చేసుకున్న సరే, ఆల్బమ్ మొత్తం బాగుంది అనేల compose చేస్తారా అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం .
అనిరుధ్  – చిన్న వయసులో మ్యూజిక్ డైరెక్టర్ గ పరిచయం అయ్యి ,తన ఫస్ట్ ఆల్బంలో Kolaveri Di పాటతో సౌత్ ,నార్త్  ,కిడ్స్ పార్టీ,బాచ్చిలర్స్ పార్టీ,పబ్,క్లబ్ , చివరకి దేవుడు ఒరేగింపు అని తేడా కూడా లేకుండా ఎక్కడపడితే అక్కడ పాడేవాళ్ళని పాడేలా ,ఆడేవాళ్ళని ఆడేలా చేసాడు.తమిళ్లో తను చేసిన 3,ethir Neechal ల్ తో మంచి ఫార్మ్లో ఉన్న అనిరుధ్  ,డేవిడ్ అనే సినిమాలో ఒక సాంగ్ ని కంపోస్ చేసి బాలీవుడ్ కి కూడా పరిచయం అవుతున్నాడు .అంతే కాకుండా తన లేటెస్ట్ ఆల్బమ్ ethir Neechal లో Yo Yo Honey Singh లాంటి పాపులర్ పాప్ సింగర్ తో తమిళ్ పాటని కూడా పాడించాడు.
తొలిప్రేమతో దేవా ,కరుణ కరణ్ ని ,ఖుషితో S J సూర్య  ,బంగారంతో ధరణి , పంజాతో విష్ణు వర్ధన్ లాంటి తమిళ్ టాలెంట్ కి  ఛాన్స్ ఇచ్చిన పవన్ , అనిరుధ్ కి కూడా తన సినిమాలో   ఒక ఛాన్స్ ఇచ్చి నేను విన్న రూమర్ ని నిజం చేస్తే ,కొత్తదనం కోరుకునే వీళ్ళిద్దరి కాంబినేషన్ అదిరిపోద్ది అనడంలో సంకోచించవలసిన అవసరం లేదు అని నా ఫీలింగ్.

Filed Under: Pawan Kalyan