ఆ విషయంలో మాత్రం పవన్ కి ఒక లెక్క ఉంది

pawan-panja

ఒక సినిమాని తీసి దాన్ని రిలీజ్ చేయడం లో ఉన్న కష్టాలు గురుంచి వినడమే గాని ప్రత్యక్షంగ ఎప్పడు చూడలేదు. కాని ఒక మంచి craze ఉన్న హీరో సినిమా ఆడియో ఫంక్షన్ ని నిర్వహించి ,సక్సెస్ చేయాలి అంటే మాత్రం ఎంత కష్టమో ఈ మధ్య జరిగిన కొన్ని ఆడియో ఫంక్షన్ చూస్తే అర్ధం అయింది.

తమ అభిమాన హీరోని డైరెక్ట్ గ చూద్దాం అని ఎక్కడెక్కడ నుంచో ఆడిటోరియంకి పరుగులు తీసే ఫాన్స్, తీరా హీరోని చూసాక ఆనందం ఆపుకోలేక వాళ్ళ అభిమానంని గోల రూపంలో చూపించడం సహజం, చెప్పాలంటే అది మన ఆనవాయితి కూడా. చూస్తుంటే కష్టం అంత హీరోదే అన్నట్టు కనిపించక పోయిన, ఆ ఫంక్షన్ సక్సెస్ /ఫెయిల్యూర్ మటికి తను react అయిన దాని బట్టే ఉంటది అని నా అభిప్రాయం . హీరో ఆ situation ని హేండిల్ చెయ్యాలంటే చాలా ఓర్పుతో వాళ్ళ crazy/గోల ని అర్ధం చేసుకోగలగాలి. కాని అంతే ఓర్పుగ రెండు గంటల పాటు ఉండాలి అంటే కొంచం కష్టమే.

డార్లింగ్ ,Mr.Perfect తో ఒక ఊపు ఒపిన ప్రభాస్ కి ఫాన్స్ నెంబర్ బాగా పెరిగిపోయింది. దానికి Proof , Mirchi ఆడియో ఫంక్షన్ కి వచ్చిన క్రౌడ్. పబ్లిక్ లో చాలా కూల్ గా ఉండే డార్లింగ్ ప్రభాస్ కూడా మిర్చి ఆడియో ఫంక్షన్ కి వచ్చిన ఫాన్స్ చేసిన గోల/హడావిడి వలన తను చెప్పాలనుకుంది చెప్పలేక, మీ గోల వలన చెప్పాలనుకుంది అంత నాలుగు ముక్కలో మాట్లాడి వెళ్ళిపోతున్న అని వెళ్ళిపోయాడు. నిన్న జరిగిన SVSC triple ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లో, ఫాన్స్ గోలకి వెంకటేష్ కూడా మీరు ఇలానే అరిస్తే నేను వెళ్ళిపోతాను అని react అయ్యారు.

ఈ లెక్క లో చూస్తే,ఆడియో ఫంక్షన్ లో గోల అంటే గుర్తోచేది పవన్ కళ్యాణ్ మూవీ ఆడియో ఫంక్షన్స్. పబ్లిక్ కి దూరంగ ఉంటాడు అనే ట్యాగ్ లైన్ ఉన్న పవన్ కళ్యాణ్న్ కి పబ్లిక్ లో ఎంత craze ఉంటదో తెలియని వాళ్ళకి ,తన మూవీ ఆడియో ఫంక్షన్ అప్పుడు ఆడిటోరియంలో place లేక బయట గేటు దగ్గర ఉండిపోయే జనాలని చూపిస్తే సరిపోతుంది.

ఇక ఆడిటోరియంలోకి పవన్ ఎంటర్ అయినప్పటి నుంచి తన పేరే జపించే ఫాన్స్ గోలని పవన్ హేండిల్ చేసే విధానం నిజంగా అభినందనీయం. తను మాట్లాడేది నాలుగు మాటలే అయిన కంగారు పడకుండా తను చెప్పాలనుకుంది క్లియర్ గా చెప్తూ, ఫాన్స్ మీద అస్సలు కంప్లైంట్ చేయకుండా వాళ్ళ పిచ్చ/ప్రేమని అర్ధం చేసుకుని ,చిరాకు పడకుండా ,situationని హేండిల్ చేస్తూ ఆడియో ఫంక్షన్ ని సుఖాంతం చేసేస్తాడు .

ఈ విధంగ చూస్తే పబ్లిక్ కి దూరంగా ఉండే పవన్ కి మాత్రం పబ్లిక్ ని హేండిల్ చేయడంలో తనకో లెక్క ఉందనిపించుకుంటాడు.

Filed Under: Pawan Kalyan