పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమా రిలీజ్ ఎప్పుడు?

pawan-trivikram

2012 ఏప్రిల్ లో రామ్ చరణ్ ‘రచ్చ’ వచ్చి మెగా అభిమానులకు పండగ వాతావరణం క్రియేట్ చేస్తే, మేలో ‘గబ్బర్ సింగ్’ వచ్చి ఆ వాతావరణాన్ని డబుల్ చేసింది.

అదే విధంగా 2013లో నాయక్ వచ్చి సంక్రాంతి సందడి చేస్తుంటే, పవన్-త్రివిక్రమ్ మూవీ సమ్మర్ సందడి చేస్తే బాగుండునని మెగా అభిమానులు ఆశీస్తున్నారు.

కాని అదే జరిగేట్టు కనిపించడం లేదు. కొందరు మెగా అభిమానుల అంచనాల ప్రకారం పవన్-త్రివిక్రమ్ సినిమా దసరా సీజన్ (2013 సెప్టెంబర్/అక్టోబర్) దాకా రాదు అంటున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా పూజా కార్యక్రమాలు అయితే జరిగాయి కాని, రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. ఇదే నిజమైతే ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ఒక్క సినిమాతో సరిపెట్టుకోవాలి.

Filed Under: Pawan Kalyan