pawanfans.comకి స్పందించిన పవన్‌కల్యాణ్

pawan-kalyan

పవన్‌కల్యాణ్‌కే కాదు ప్రపంచంలో ఎవరికైనా వ్యక్తిగతంగా “మన అనే పిచ్చి” వుండదు. కాని ఎవరైనా ఏదైనా సాధిస్తే ఆ వ్యక్తులను మనవాడు అని కలుపుకొవడానికి దారులు వెతుక్కుంటారు. అదే విధంగా చిరంజీవిని మావాడు అని కాపు కులానికి చెందిన తెలుగువాళ్ళందరూ ఫీల్ అవుతారు. అదే విధంగా పవన్‌కల్యాణ్‌ను ఫీల్ అవుతారు. కేవలం కులం చూసే వాళ్ళు అభిమానిస్తున్నారు అంటే తప్పు. ఆ కులానికి చెందిన వాళ్ళే కాదు, చిరంజీవిని పవన్‌కల్యాణ్‌ను కులాలకు ఆతీతంగా అభిమానించే వాళ్ళు కూడా వున్నారు. మన తెలుగు హిరోలందరికీ ఇటువంటి ఫాలోయింగ్ వుంది. పవన్‌కల్యాణ్ వెంట కాపు యువత ఎక్కువ వున్నారు, మహేష్‌బాబు వెంట కమ్మ యువత ఎక్కువ వున్నారంటే దానిని ఖండించ వలసిన అవసరం లేదు. అవమానంగా ఫీల్ అవ్వవలిసిన పని అసలు లేదు. దానికి రిప్లైగా “నాకు కుల మత బేధాలు లేవు” అని పదిసార్లు చెప్పవలసిన పని లేదు. పవన్‌కల్యాణ్‌కే కాదు, ఏ తెలుగు హిరోకు అటువంటి ఫీలింగ్స్ లేవు.

దురదృష్టవశాత్తు, భీమవరంలో ప్రభాస్ అభిమానులకు పవన్ అభిమానుల మధ్య పొటీ వాతావరణం శృతి మించి కులాల గొడవగా అవతరించి ఆస్తులు ధ్వంసంగా చేసుకునేంతగా తీవ్ర రూపం దాల్చింది. తప్పు ఇరు వర్గాల్లో వుంది. పవన్ అభిమానులకు మాత్రమే శిక్ష పడింది. ఇక్కడ కలుగ జేసుకుంటే కులముద్ర వేస్తారనే భయమో, మరొకటో మళ్ళీ “నాకు కులమత బేధాలు లేవు” అని సెల్ఫ్ డబ్బా స్టేట్‌మెంట్స్ బయటకు వచ్చాయి. అదే విషయాన్ని దాచకుండా pawanfans.com రిపోర్ట్ చెయ్యడం జరిగింది. pawanfans.com కు స్పందిస్తూ “తప్పు నా ఫ్యాన్స్ చేసినా నేను చేసినట్టే” అని పవన్‌కల్యాణ్ ఫీల్ అయ్యి పవన్‌ఫ్యాన్స్ ను అదుకోవడం సర్వత్రా పవన్‌కల్యాణ్‌పై అభినందలు వెలువడుతున్నాయి.

good job Pawan Kalyan !

పవన్ బ్యానర్ల విషయంలో జరిగిన గొడవ చిరవకు 144 సెక్షన్ వరకూ దారితీసింది. ప్రభాస్, అభిమనులు పవన్ ప్లెక్సీలను బ్యానర్‌లను ధ్వంసం చేసినందుకు పవన్ అభిమానులు గొడవ పడి, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్థులకు కూడా నష్టం చేకూర్చారు. ఈ ఘటనకు కారణమైన వారిని అరెస్ట్ చేస్తే పవన్ స్వయంగా వారిని విడిపించాడు. అంతేకాదు ప్రభుత్వ ఆస్థుల నష్టాన్ని తెలుసుకున్న పవన్ వాటిని రిపేర్ చేయించడానికి మూడు లక్షలు రూపాయలను పంపారని.. భీమవరం ఎస్‌ఐ తెలిపారు. పవన్ నిజాయితీ అంటే తెలిసిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

Filed Under: Pawan KalyanJust4Fun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *