ప్రభాస్ ‘మిర్చి’ ఏ రేంజ్ సినిమా?

Prabhas-Mirchi

2013 సంక్రాంతి కి చాలా సినిమాలు సిద్దం అయినా, ఆ సమయంలో థియేటర్స్ అన్నీ నాయక్ & సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలే ఆక్రమించేయడం వలన ఆ సినిమాలన్నీ ఫిబ్రవరిలో ఒక దాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతున్నాయి. ఆ ఫిబ్రవరి సినిమాలలోఒకటైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ చిత్రం ఫిబ్రవరి 8న విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేసారు.

అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ ప్రభాస్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రభాస్ ‘మున్నా’ & ఎన్.టి.ఆర్’బృందావనం’ చిత్రాలకు తుటాల్లాంటి మాటలు అందించిన కొరటాల శివ ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

యు.వి. క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ ఫ్రెండ్స్ వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా ‘మిర్చి’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో పాటలు ఇప్పటికే మంచి ప్రేక్షకాదరణ పొందాయి.

ఈ సినిమా రిలీజ్ సందర్భంగా తెలుగు ప్రేక్షకులను చాలా ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఆ ప్రశ్నలలో కొన్ని:

  1. హైట్ కు హైట్. ఇమేజ్ కు ఇమేజ్. యాక్షన్ కు యాక్షన్. అన్నీ వున్న ప్రభాస్, తన సినిమాల రేంజ్ ఎందుకు పెంచు కోలేకపోతున్నాడు?
  2. తాను సెలెక్ట్ చేసుకునే సబ్జక్ట్స్ లో లోపం వుందా? ప్రభాస్ ను దర్శకులు తక్కువ అంచనా వేస్తున్నారా?
  3. ప్రభాస్ ‘మిర్చి’ ఏ రేంజ్ సినిమా అవుతాది?

ఈ ప్రశ్నలకు మిర్చి రిజల్ట్ ఏ విధమైన సమాధానం చెపుతుందో చూడాలి.

Filed Under: Extended FamilyFeatured