రామజోగయ్య శాస్త్రికి పూరి జగన్నాథ్‌ అభినందనలు

pawan-pranitha

Lakshmi Manchu:
Can’t wait to see power star wooing @Samanthaprabhu2 for ninnu chudagaane in #AtharintikiDaredi. Sigh! In love.

అందరికీ ఒకే పాట నచ్చాలని రూల్ ఏమీ లేదు. సినిమా వచ్చాక విజువల్స్ చూసి ఇప్పుడు నచ్చని పాట అప్పుడు నచ్చవచ్చు. అలానే ఇప్పుడు “అత్తారింటికి దారేది” సినిమాలోని పాటల్లో ఒక్కొకరి ఒక్కో పాట నచ్చింది.

మంచు లక్ష్మీ కి దేవిశ్రీ ప్రసాద్ పాడిన ‘నిన్ను చూడగానే’ అనే సాంగ్ నచ్చిందంట. అలానే మొన్న ఈనాడు సినిమాలో పూరి జగన్నాధ్ “బాపు గారి బొమ్మో” పాటను అభినందించారని చెప్పిన సంగతి తెలిసిందే.

కొన్ని పాటలు వినగా వినగా బాగుంటాయి. ఇంకొన్ని పాటలు మొదటిసారే నచ్చేస్తాయి. అలాంటి పాటల్లో “బాపు గారి బొమ్మో” ఒకటి. పాటలో తెలుగుదనం చక్కగా కుదిరింది. త్రివిక్రమ్‌గారు సందర్భం చెప్పిన తరవాత.. మూడు నెలల సమయం తీసుకొన్నా. అప్పుడప్పుడూ.. ఒక్కో చరణం రాసుకొన్నా. త్రివిక్రమ్‌ దగ్గర నాకుండే వెసులుబాటు అదే. కావల్సినంత సమయం ఇస్తారు.

దేవిశ్రీ ప్రసాద్‌ ఇచ్చిన సలహాలూ, సూచనలూ ఈ పాట ఇంత చక్కగా కుదరడానికి దోహదం చేశాయి. కత్తులు లేని యుద్ధం చేసి నన్ను గెలిచింది, మాయలోకంలోకి నన్ను తోసి తలుపులు మూసి తాళం పోగొట్టేసింది, కూరల్లో వేసే పోపు నా వూహల్లో వేసింది, గుండెను గుప్పిట మూసి వూపిరి తీసింది, అందమన్న గంధపు గాలితో మళ్లీ వూపిరి పోసింది – ఇలాంటి అందమైన భావాలు చెప్పగలిగే అవకాశం ఈ పాటతో కలిగింది.

పాట విన్న వెంటనే పూరి జగన్నాథ్‌ నాకు ఫోన్‌ చేసి అభినందించడం మరింత ఉత్సాహాన్నిచ్చింది.

–పూరి జగన్నాథ్‌

Filed Under: Pawan KalyanFeatured