పూరి జగన్నాధ్ vs శ్రీకాంత్ అడ్డాల

varun-tej

మన తెలుగు ప్రేక్షకులు కాని, వంశం అభిమానులు కాని సినిమా అంతా హిరో భుజ స్కందాలపై నడిచినట్టుగా వుండాలనుకుంటారు. హిరో కోసమే కథ వుండాలి, కథ కోసం హిరో అంటే ఒప్పుకోరు.

శ్రీకాంత్ అడ్డాల అయితే కథ వ్రాసుకొని ఆ కథను హీరోకు అనుగుణంగా మార్పులు చేస్తాడు. పూరి జగన్నాధ్ అయితే హిరో కోసమే కథ వ్రాసి, హిరోను ప్రేక్షకులు ఎలా కోరుకుంటారో అలా చూపిస్తాడు.

ఒక మెగాస్టార్ తనయుడిని ‘చిరుత’ ద్వారా పూరి జగన్నాధ్ పరిచయం చేసినట్టుగా మరో దర్శకుడేవరూ చేస్తారని నేననుకోను. రామ్ చరణ్ ఏ విభాగాలలో కంఫర్ట్ బుల్లో, వాటిని హైలట్ చేస్తూ ప్రేక్షకులు అభినందించేలా తీసాడు. ఆరడుగుల వరుణ్ తేజ్ ను మాస్ హీరోగా పరచియం చెయ్యాలంటే పూరి జగన్నాధ్ is బెస్ట్ ఛాయిస్. సినిమా కథ హిరోను & హిరో స్కిల్స్ ను ఎస్టాబ్లిష్ చెయ్యడానికి అన్నట్టు వుంటుంది కాబట్టి , సినిమా సూపర్ హిట్ ఛాన్సస్ తక్కువ. ఏవరేజ్ గా వుంటుందంతే.

శ్రీకాంత్ అడ్డాల అయితే కథ స్ట్రాంగ్ గా వుంటుంది, మంచి టాక్ వచ్చే ఛాన్స్ వుంటుంది కాని, డైరక్టర్ కే ఎక్కువ పేరు పోతుంది.

పూరి లేటెస్ట్ ఇంటార్వ్యూ లని బట్టి చూస్తే వరుణ్ తేజ్ సినిమా కోసం పూరిని ఎప్రోచ్ అయినట్టుగా ఏమి కనిపించ లేదు. శ్రీకాంత్ అడ్డాల వైపే మొగ్గు చూపుతున్నట్టుగా వున్నారు.

హైట్ విషయంలో మహేష్ బాబు, ప్రభాస్, రానా లకు ధీటుగా నిలిచే మెగా హిరో ‘వరుణ్ తేజ్’.

Filed Under: Mega FamilyFeatured