రచ్చ – my exclusive review

racha

సినిమా ఎలా వుంది?
చిరంజీవి ఫ్యాన్స్ కు పండగ.
మాస్ ప్రేక్షకులకు పైసా వసూల్ మూవీ.
మిగతా వాళ్ళకు ఎవరేజ్.

ఈ సినిమా గొప్పతనం ఏమిటి?
ప్రతి హీరోకు లిమిటేషన్స్ వుంటాయి. అలానే రామ్ చరణ్ కూ వున్నాయి. ప్రతి నిమిషం చుట్టూ వున్న భజనపరుల మాటలు వింటూ హిరో ఆ లిమిటేషన్స్ ఏమిటో కరక్ట్ గా తనకు తానుగా తెలుసుకొవడం అంత ఈజీ కాదు. తన లిమిటేషన్స్ ఏమిటనేది రామ్ చరణ్ కు బాగా తెలుసు అని అర్దం అయ్యింది. ఆ పరిధిలో కథను ఎంచుకొని నటించడం ఈ సినిమా గొప్పతనం గా అనిపించింది.

తనకున్న లిమిటేషన్స్ కు తోడు, S/O చిరంజీవి అనే బరువును ఒక బాద్యతగా తీసుకోవడం గ్రేట్ అయితే:

అతి చిన్న వయసులోనే, ఒకే ఒక సినిమా అనుభవంతో , రాజమౌళి మగధీర సినిమా ద్వారా నీకు నీ తండ్రి ఇచ్చిన స్టామినా ఇది అని తనపై మోపిన భారాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోని అపర్నిహాశాలు కష్టపడుతున్న యంగ్ చార్మ్ రామ్ చరణ్.

సినిమా రేటింగ్ ఎంత? దూకుడు రికార్డ్స్ ను బద్దలు కొడుతుందా? బిజినెస్ మెన్ రికార్డ్స్ ను బద్దలు కొడుతుందా?
ఈ సినిమా కొడుతుందో లేదో చెప్పలేను కాని చిరంజీవి లో వున్న కసి రామ్ చరణ్ లో కూడా వుందని అభిమానులకు భరోసా ఇచ్చే సినిమా. it is like more than 5/5 rating and more than Magadhira.

పాటలు ఎలా వున్నాయి?
రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. మంచి స్టెప్స్ తో పాటు, డాన్స్ చేస్తున్నప్పుడు చిరంజీవిలో కనిపించే గ్రేస్ కనిపించింది. ప్రస్తుతం చిరంజీవి అంత లేదు కాని, ఫ్యూచర్ లో సాధించే దిశగా ప్రయత్నం కనిపించింది..

స్టోరీ ఏమిటి?
మంచి మాస్ స్టోరి. ఎంటరటైనమెంట్ వే చెప్పే ప్రయత్నం జరిగింది. కామెడీ బాగా పండింది. బిగ్ ప్లస్.

వంశం డైలాగ్స్ అతిగా అనిపించాయ?
NO. మాస్ నే కాదు, అందరినీ బాగా అలరించాయి.

తమన్నా ఎలా చేసింది?
గ్లామర్ గా కనిపించడంతో పాటు, కీలక సన్నివేశాలలో పెరఫార్మన్స్ బాగుంది.

డైరక్టర్ గొప్పతనం ఏమిటి?
మాస్ కు నచ్చే సింపుల్ కథ. ఎంటరటైనమెంట్ వే లో గ్లామర్ జోడించి చెప్పడం.

డ్రాబ్యాక్స్ ఏమిటి?
లాజికల్ ఫ్లో కరెక్ట్ గా లేదు. ఎన్నో డౌట్స్ రైజ్ అవుతాయి. సర్దుకుపోవాలి.

Filed Under: Mega FamilyHari Reviews