మగధీర vs నాయక్

Rajamouli-VV-Vinayak

మాస్ పల్స్ తెలిసిన తెలుగు దర్శకులు రాజమౌళి & వి.వి.వినాయక్.

రాజమౌళికి రెండు & మూడు సినిమాలు ఓవర్ బడ్జట్ అయిన సినిమాలు వున్నాయి కాని, అపజయాలు మాత్రం లేవు అనే చెప్పవచ్చు. వి.వి.వినాయక్ సినిమాలలో ‘యోగి’ & ‘బద్రినాథ్’ మినహా మిగతా సినిమాలన్నీ హిట్సే.

‘మగధీర’ & ‘నాయక్’ రెండు సినిమాలూ భారీ బడ్జట్ .. భారీ ఎక్సపేటేషన్స్ .. తో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల ద్వారా రామ్ చరణ్ ఏమి సాధించారు? ఈ భారీ దర్శకులిద్దరూ మెగా పవర్ స్టార్ చరణ్ ను ఎలా హ్యాండిల్ చేసారో చూద్దాం.

ఈ రెండు సినిమాల మొదటి లక్ష్యం కమర్షియల్ సక్సస్.
ఈ ఇద్దరు దర్శకులు సాధించారు.

రెండో లక్ష్యం రామ్ చరణ్ కు ప్రత్యేక ఇమేజ్ సాధించడం.
ఈ విషయంలో రాజమౌళి ఎక్కువ సాధించాడని చెప్పవచ్చు. చరణ్ కు సూట్ అయ్యే గెటప్ వేయించడమే కాదు, ఒక పక్క చరణ్ ప్రతిభను ఉపయోగించుకుంటూనే చరణ్ ఏ కోణంలో ప్రేక్షకులకు నచ్చుతాడో ఆ కోణంలో చూపించాడు. ఈ సినిమా అనుకున్న దగ్గరనుండి ప్రతి క్షణం తాను ఎంతో కష్ట పడుతూ, అవుట్ పుట్ కోసం రామ్ చరణ్ ను కూడా అంతే ట్రైనింగ్ తో కష్టపెట్టాడు.

నాయక్ విషయంలో వి.వి.వినాయక్ ఎక్సట్ర్ ఏమి కష్టపడలేదు. రామ్ చరణ్ ను కష్టపెట్టలేదు. జస్ట్ పాటల విషయంలో రామ్ చరణ్ ను కష్టపెట్టాడు అంతే.

రాజమౌళి రామ్ చరణ్ కు ప్రత్యేక ఇమేజ్ సాధించిపెడితే, వినాయక్ జస్ట్ నిలబెట్టాడు అంతే. ఇప్పుడు నాయక్ సాధించిన కమర్షియల్ విజయం, ఇంతకు ముందే రామ్ చరణ్ రచ్చ ద్వారా సాధించేయడం వలన, వి.వి. వినాయక్ ప్రత్యేకత ఏమీ కనిపించడం లేదు. రామ్ చరణ్ ఆరెంజ్ ఫ్లాప్ నుంచి గట్టెక్కడానికి రచ్చ సినిమా చేసినట్టు, వినాయక్ బద్రినాథ్ ఫ్లాప్ నుంచి గట్టెక్కడానికి ‘నాయక్’ సినిమా చేసినట్టు వుంది.

Filed Under: Mega FamilyFeatured