ఇది పవన్‌కల్యాణ్ సినిమా

PK

Ram Gopal Varma ‏@RGVzoomin
Rajmouli +Prabhas +Hollywood level CG + 300 days shooting + 150 crores budget = just Only Pawan Kalyan

జనాలు సర్దార్ గబ్బర్‌సింగ్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో రాంగోపాలవర్మ తన ట్వీట్‌లో బాగా వివరించాడు. సినిమా కోసం పెట్టిన ఖర్చు, పవన్‌కల్యాణ్ పడిన కష్టాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇలా ఫీల్ అవుతుంటే, సానుభూతి వేవ్ క్రియేట్ అవ్వడం కష్టం.

సానుభూతి వేవ్:
సినిమా రిలీజ్‌కు ముందు ఒక సానుభూతి వేవ్ క్రియేట్ అవ్వాలి. గబ్బర్‌సింగ్‌కు అత్తారింటికి దారేది సినిమాకు ఆ వేవ్ వుంది. బాహుబలికి అయితే పీక్. రాజమౌళి ఎంతో కష్టపడి తీసాడు అని అందరూ ఫీల్ అయ్యారు. రుద్రమదేవి కి కూడా క్రియేట్ అయ్యింది. ఆ సానుభూతి వేవ్ వలన చాలా ఉపయోగం వుంది. సినిమాలో వుండే లోపాలను ప్రేక్షకులు క్షమించేస్తారు. విశ్లేషకులు హైలట్ చెయ్యరు. ఈ వేవ్ అవసరం చాలా వుంది. సర్దార్ గబ్బర్‌సింగ్ రిలీజ్‌కు ఇంకా రెండు వారాలే వుంది. ఇంకా ఆ వేవ్ క్రియేట్ అవ్వలేదు. దానికితోడు, వివిధ కారణాల వలన చాలామంది పవన్‌కల్యాణ్ మీద పగతో వున్నారు. దానికి కారణం బహుశా “ఇది పవన్‌కల్యాణ్ సినిమా” అవ్వడం వలనెమో. డైరక్టర్‌ని కేవలం డైరక్షన్‌కే పరిమితం చెయ్యకుండా, మొత్తం అతనికే వదిలేయవలసింది. సినిమా బాద్యత మొత్తం తన మీద వేసుకొవడం వలన అనవసరమైన ఒత్తిడి మినిహా పవన్‌కల్యాణ్‌కు పెద్దగా ఉపయోగం లేదు.

bottomline:
ఈ సినిమాకు పనిచేస్తున్న పబ్లిసిటీ టీమ్, రెండు వారాల్లో సానుభూతి వేవ్ క్రియేట్ చేయగల్గాలి.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *