రామ్ చరణ్ ‘ఎవడు’ మూవీ ఆడియో రివ్యూ

evadu

ఏ సినిమా ఆడియో రిలీజ్ అయినా, ఆ సినిమా రిలీజ్ అయ్యేదాక లూప్ లో పెట్టి అదే పనిగా వినడం అలవాటు. మొన్న వచ్చిన ‘సింగం’ పాటలు కాని నిన్న వచ్చిన ‘ఎవడు’ పాటలు కాని ఫస్ట్ టైమ్ వినగానే 1) లూప్ లో పెట్టి వినలేం 2) ఈ పాటలు హిట్ అవ్వాలంటే సినిమా హిట్ అవ్వాలి అని అనుకున్నాను కాని, రెండు మూడు సార్లు విన్న తర్వాత స్లోగా బాగా ఎక్కేసాయి.

సాంగ్1- ఫ్రీడ‌మ్:
ఈ మధ్య వచ్చిన బెస్ట్ సాంగ్ విత్ బెస్ట్ డాన్స్ అంటే నాయక్ లో ఫస్ట్ సాంగ్. ఆ సాంగ్ తమన్ ఇచ్చాడు, దేవిశ్రీ ప్రసాద్ దానిని మించి ఇస్తాడనుకుంటే నిరాశే. ఫాస్ట్ బీట్ తో వున్నా డిఫెరెంట్ గా డిజైన్ చేసాడు పైడిపల్లి వంశీ. కృష్ణ చైతన్య ఈ పాటకి సాహిత్యం అందించాడు. అతని సాహిత్యం బాగుంది. ఈ పాటలో ప్రస్తుతం ఉన్న యంగ్ జెనరేషన్ యొక్క ఫ్రీడం గురించి చెప్పారు. యువతకు ప్రేరణ ఇచ్చేలా పాటను ప్రత్యేకంగా రాయించటంతో ఈ పాట డీసెంట్ హిట్ గా ఈ ఆల్బమ్ లో నిలుస్తోంది.

సాంగ్2- నీ జ‌త‌గా:
సీతారామశాస్త్రిగారు సాహిత్యం రాసిన ఈ పాట ఈ ఆడియో కి హైలైట్ గా చెప్పవచ్చు. కార్తీక్, శ్రేయ ఘోషల్ వాయిస్ ఈ పాటకు పెద్ద ప్లస్. ఇప్పటికే ఈ సాంగ్ బాగా బాగా పాపులర్ అయ్యింది. ఈ సాంగ్ ప్రోమో చూస్తే…పాటను కూడా బాగా తీశారని అర్థమవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ చేసిన టాప్ టెన్ మెలోడి సాంగ్స్ లో ఈ పాట ఒకటిగా చెప్పవచ్చు.

సాంగ్3- అయ్యో పాపం:
ఐటెం సాంగ్. ఎప్పుడో యూ ట్యూబ్ లో విడియో లీక్ అయ్యి, చాలా మంది చూసేసారు. మాస్ కు నచ్చే సాంగ్.

సాంగ్4- చెలియా చెలియా:
మొత్తం ఆల్భం ఫీల్ నే మార్చేసిన పాట్ ఇది. ఊసరవెల్లి లో మొదటి పాట గుర్తుకు వస్తుంది. సినిమాలో సిట్యువేషనల్ సాంగ్ లా వుంది. ఈ పాట కొందరికి విపరీతంగా నచ్చే అవకాశాలు వున్నాయి.

సాంగ్5- ఓయే ఓయే:
దేవీశ్రీ ప్రసాద్ నుంచి కొత్తగా అనిపించే సాంగ్. ఎవరేజ్.

సాంగ్6- పింపుల్ డింపుల్:
ఇద్దరమ్మయిలతో ‘టాప్ లేచిపోద్ది’ సాంగ్ గుర్తుకు తెచ్చే మాస్ సాంగ్. బాగుంది.

bottom line:
“రచ్చ” “నాయక్” బిగ్గ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్. కాని రామ్ చరణ్ ఊర మాస్ సినిమాల వైపు వెళ్లి పోతున్నాడని చాలా మంది అభిమానులు బెంగ పెట్టుకున్నారు. వారి బెంగకు ఫుల్ స్టాఫ్ పెట్టి, దర్శక నిర్మాతలు మంచి కథతో వస్తే ఎంత రిస్క్ చెయ్యడానికైనా చరణ్ రెడీ అని తెలియజేసే చిత్రం ‘ఎవడు’. పాటలు విన్నాక అది కన ఫార్మ్ అయ్యింది. రొటీన్ మాస్ సినిమా కాదు, నిజంగానే ఎదోకొత్తగా ట్రై చేసారని చెప్పవచ్చు.

Filed Under: Mega FamilyFeatured