రామ్‌చరణ్ షూటింగ్ ప్రారంభం !!!

Share the joy
  •  
  •  
  •  
  •  

ramcharanaravindswamy

చిరంజీవి వారసుడిగా రామ్‌చరణ్ ప్రతి సినిమాపై ఒత్తిడి వుంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శలు వినిపిస్తూనే వుంటాయి. ప్రస్తుతం తమిళంలో విజయం సాధించిన ‘తని ఒరువన్‌’ సినిమా రీమేక్‌ లో నటిస్తున్నాడు. ఈ నిర్ణయంపై కూడా ఎన్నో విమర్శలు వినిపిస్తూనే వున్నాయి.

ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మిస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గచ్చిబౌలి దగ్గర ఐటీ జోన్ లో ఉన్న ఓ పెద్ద కాంప్లెక్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది. రామ్ చరణ్ ఈ రోజునుంచి షూటింగ్ లో పాల్గోంటున్నాడంట. ఇదే రామ్‌చరణ్ పాల్గొంటున్న మొదటి రోజు అనుకుంట. రామ్‌చరణ్ వుండే సీన్స్ మినహా సినిమా అంతా షూటింగ్ అయిపొయింది.

బ్రూస్‌లీ మాదిరి హాడావుడిగా కాకుండా, చాలా రిలాక్స్డ్‌గా పనిచేస్తున్నాడు. రామ్ చరణ్ ఓ ట్రైనీ ఐపియస్ పాత్ర పోషిస్తుండగా అరవింద్ స్వామి తమిళ్ లో తను పోషించిన విలన్ పాత్రనే పోషిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ‘ధృవ’ అని టైటిల్ అనుకుంటున్నారు. ఇంకా ఆఫీషియల్‌గా ఎనౌన్స్ చెయ్యలేదు. దసరాకు రిలీజ్ టార్గెట్ చేసుకొని, దానికనుగుణంగా స్లోగా పని చేస్తున్నారు.

Filed Under: ధృవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *