దశరథ్ డైరక్షన్‌లో రామ్‌చరణ్

Dasarath

రామ్‌చరణ్ నెక్స్ట్ మూవీ చాలా హాడావుడిగా బండ్ల గణేష్ నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వంలో పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కాని కొరటాల శివ చెప్పిన కథ రామ్‌చరణ్‌కు నచ్చక పొవడంతో అది ఆగిపోయినట్లే అని వార్తలు వచ్చాయి.

కొరటాల శివ కథను ఎన్.టి.ఆర్ ఒకే చెయ్యడంతో, రామ్‌చరణ్ కు మంచి కథ అందించే వేరే దర్శకుడిని వెతికే పనిలో బండ్ల గణేష్ పడ్డాడు. కృష్ణవంశీ కథ వినిపించాడు కాని, 60 కోట్లు బడ్జెట్ అడగటంతో బండ్ల గణేష్ చేతులేత్తేసాడంట.

సంతోషం ,మిస్టర్ పరఫెక్ట్ & గ్రీకు వీరుడు ఫేం దశరథ్ ఒక కథ తయారు చేసాడంట. రామ్‌చరణ్ ఒకే చేస్తే, దశరథ్ డైరక్షన్‌లో రామ్‌చరణ్ సినిమా వుండే అవకాశం వుంది.

దశరథ్ కథ కుదరక పోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ లేదా హరీష్‌శంకర్ ఒకే ఆయ్యే అవకాశాలు వున్నాయి.

Filed Under: Mega FamilyFeatured