త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ చరణ్

ram-charan-trivikram

ప్రేక్షకుల దృష్టిలో

మగధీరకు ముందు రాజమౌళి వేరు .. మగధీరకు తర్వాత రాజమౌళి వేరు

దూకుడుకు ముందు శ్రీను వైట్ల వేరు .. దూకుడుకు తర్వాత శ్రీను వైట్ల వేరు

పోకిరికు ముందు పూరి జగన్నాధ్ వేరు .. పోకిరికు తర్వాత పూరి జగన్నాధ్ వేరు

ఖలేజకు ముందు మహేష్ బాబు వేరు .. ఖలేజకు తర్వాత మహేష్ బాబు వేరు ..

మగధీరకు ముందు రాజమౌళి దగ్గర జ్యూస్ అయిపోయింది అనుకున్నారు .. అలానే దూకుడుకు ముందు శ్రీను వైట్ల .. పోకిరికు ముందు పూరి జగన్నాధ్

ఖలేజకు ముందు మహేష్ బాబుకు కామెడీ టైమింగ్ లేదు , మహేష్ బాబుకు ఒన్ మేన్ షో చెయ్యడం రాదు అనుకునే వాళ్ళు

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తే, ఆ సినిమా కమర్షియల్ హిట్ తో సంబంధం లేకుండా .. రామ్ చరణ్ & త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మంచి పేరు తెచ్చి పెట్టేదై వుండాలి ..

కాని:
ఇప్పుడు సినిమాలన్నీ హడావుడిగా చుట్టి పారేస్తున్నారు .. కమర్షియల్ హిట్ కోసమే టార్గెట్ చేస్తున్నారు .. so, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా మరో మామూలు సినిమానే అవ్వడానికి ఛాన్సస్ వున్నాయి.

Filed Under: Mega FamilyFeatured