రామ్ చరణ్ – what next?

రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్ ‘ఎవడు’ తర్వాత చెయ్యబోయే తెలుగు సినిమా ఏమిటనేది ఇంకా నిర్ణయించుకున్నాడో లేదో తెలియదు కాని, ఇంకా ప్రకటించలేదు.

జగన్ సాక్షి మీడియా న్యూస్ ప్రకారం బండ్ల గణేష్-కొరిటాల శివ సినిమా చెయ్యవచ్చు. అదే విధంగా బోయపాటి శ్రీను తో కూడా ఒక సినిమా చేసే అవకాశం వుందని ఆ మద్య న్యూస్ వచ్చింది.

నాయక్ సినిమా సూపర్ హిట్ అని అనిపించుకున్నా, కలక్షన్స్ ఆ స్థాయిలో సాధించలేకపోయింది. కారణం ఆ సినిమాలో వున్న అనవసరమైన వయలెన్స్ అని ఎవరిని అడిగినా చెపుతారు.

ఇప్పుడు బోయపాటితో అంటే క్లాస్ ప్రేక్షకులకు చరణ్ పూర్తిగా దూరమయ్యే ఛాన్సస్ వుంది కాబట్టి ఆరెంజ్ తర్వాత కృష్ణవంశీని పక్కన పెట్టినట్టు బోయపాటిని ప్రస్తుతం పక్కన పెట్టేయవచ్చు.

గీతా ఆర్ట్స్ కు మురగదాస్ ఒక సినిమా కమిట్ అయ్యాడని కూడా ఒక న్యూస్ ప్రచారంలో వుంది. ఈ గీతా అర్ట్స్ సినిమా అల్లు శిరీష్ చేస్తాడో రామ్ చరణ్ చేస్తాడో పవన్ కళ్యాన్ చేస్తాడో ఇంకా తెలియదు.

SO

రామ్ చరణ్ – what next అనేది ఇంకా సస్పెన్సే. ఎవడు రిలీజ్ కు ముందే తెలుస్తుందో, ఎవడు రిలీజ్ తర్వాత కమిట్ అవుతాడో చూడాలి.

Filed Under: Mega FamilyFeatured