“రామయ్యా వస్తావయ్యా!” మినిమమ్ 50 కోట్ల సినిమా

NTR

రాష్ట్ర విభజన అంశంతో మొదలైన ఆందోళన్ల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. దీనికి తోడు పైరసీ భూతం. అత్తారింటికి దారేది రేంజ్‌ను తగ్గించేసాయి అని చెప్పవచ్చు. లేకపొతే ఈ టాక్‌తో కచ్చితంగా మగధీరను కొట్టేసేది. అత్తారింటికి దారేది రేంజ్‌ ఏమిటనేది పక్కన పెట్టి, ఇప్పటి వరకు ఇంచుమించు 50 కోట్లు లేదా 50 కోట్లు పైన సాధించిన సినిమాల లిస్ట్ చేస్తే:

అత్తారింటికి దారేది
బాద్‌షా
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
నాయక్
గబ్బర్‌సింగ్
దూకుడు
మగధీర

“రామయ్యా వస్తావయ్యా!” మినిమమ్ 50 కోట్లు షేర్ కలెక్ట్ చేసి, పై లిస్ట్‌లో చేరడం ఖాయం అని ట్రేడ్ పండితులు అంటున్నారు.

Filed Under: Extended Family