అక్టోబర్ 11న ‘రామయ్యా వస్తావయ్యా’

NTR

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటించిన సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’. శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ పవర్ ప్యాక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని దిల్ రాజు నిర్మించారు. ఈరోజు సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ బోర్డు వారు సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ సినిమాలో మాత్రం ఎలాంటి కట్స్ విధించలేదు. ఈ మూవీలో హై వోల్టేజ్ తో కూడిన యాక్షన్ ఎపిసోడ్స్ ఉండడంతో ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.

ఎన్.టి.ఆర్ ఎంతో నమ్మకంగా ఉన్న ఈ సినిమా కోసం తన అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా శుక్రవారం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా పవన్‌కల్యాణ్‌కు గబ్బర్‌సింగ్ అందించిన డైరక్టర్ హరీష్‌శంకర్ దర్శకుడు కావడానికి తోడు, అత్తారింటికి దారేది రిలీజ్‌కు ముందే పైరసీ ప్రింట్ వచ్చినప్పుడు యంగ్ ఎన్.టి.ఆర్ అత్తారింటికి దారేది టీమ్‌కు మంచి సపోర్ట్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. So, చాలా మంది మెగా అభిమానులు ఓపెన్‌గా సపోర్ట్ అందిస్తున్నారు.

Filed Under: Extended Family