‘ఎవడు’పై రామయ్యా వస్తావయ్యా ప్రభావం

RV-EVADU

అత్తారింటికి దారేది సూపర్ డూపర్ టాక్ విని చూసిన వాళ్ళు, సినిమా బాగానే వుంది కాని మరీ అంతా సూపర్ డూపర్ టాక్ అనేంత ఏముంది అని అంటుంటే,

రామయ్యా వస్తావయ్యా చూసిన వాళ్ళు రివర్స్‌లో సినిమా బాగానే వుంది కదా, idlebrain Jeevi రివ్యూ వ్రాయలేనంతగా బ్యాడ్ ఏమీ లేదు అని అంటున్నారు. ఫస్టాఫ్ చాలా బాగుంది, సెకాండాఫ్ యాక్షన్ సీన్స్ కొద్దిగా ట్రిం చేస్తే సినిమా బాగుంది అని అంటున్నారు. హరీష్‌శంకర్ ఎన్.టి.ఆర్ ను చాలా కొత్తగా ప్రెజెంట్ చేసాడు, ఎన్.టి.ఆర్ చాలా బాగా చేసాడని అంటున్నారు. దిల్ రాజు & ఎన్.టి.ఆర్ బ్యాడ్ టైమ్ అంతే.

బ్యాడ్ టైమ్ తో పాటు రామయ్యా వస్తావయ్యా డివైడ్ టాక్(మాస్‌కు & 50% ఫ్యాన్స్‌కు బాగా నచ్చింది) రావడానికి కొన్ని కారణాలు:

1) పది సంవత్సరాల క్రితం వున్న ఎన్.టి.ఆర్ ఇమేజ్‌ను బేస్ చేసుకొని వ్రాసిన కథ
2) పగ ప్రతీకారం కథలతో ప్రేక్షకులు విసిగెత్తి వున్నారు
3) టూ మచ్ హైప్

‘ఎవడు’పై రామయ్యా వస్తావయ్యా ప్రభావం బాగా పడేట్టు వుంది. మెయిన్ కామన్ పాయింట్ ఏమిటంటే, పగ ప్రతీకారంతో నడిచే సిరీయస్ కథ. కాకపొతే, దిల్ రాజు రామయ్యా వస్తావయ్యా మాదిరి ‘ఎవడు’ సినిమా మొత్తం పూర్తిగా దర్శకుడి మీద వదిలేయలేదు. దిల్ రాజు పూర్తీ అంగీకారంతోనే ప్రతి సీనూ వుండి వుంటుంది. దిల్ రాజు జడ్జిమెంట్ తప్పు అయితే చెప్పలేం అనుకోండి.

Filed Under: Mega FamilyFeatured