రామ్‌చరణ్ ‘బ్లాక్ బస్టర్’ సినిమా మొదలైంది

ram-charan-koratala-siva-movie-launch-photos 14 (1)

‘మిర్చి’ లాంటి ఘాటైన హిట్‌ని ప్రేక్షకులకు అందించిన కొరటాల శివ దర్శకుడిగా, ‘నాయక్’గా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించిన రామ్‌చరణ్ కొత్త సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ నిర్మాత.

ముహూర్తపు దృశ్యానికి బండ్ల గణేష్ తండ్రి బండ్ల నాగేశ్వరరావు కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ నటుడు, కేంద్రమంత్రి చిరంజీవి క్లాప్ ఇచ్చారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ -‘‘రామ్‌చరణ్‌తో ఓ సంచలనాత్మక చిత్రం తీయాలనే కసితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. కొరటాల శివ కథ నిజంగా అద్భుతం. యాభై మంది భారీ తారాగణం ఇందులో నటిస్తారు. కథానాయిక వివరాలు త్వరలో తెలియజేస్తాం. అత్యున్నత సాంకేతిక విలువలతో తీయబోతున్న ఈ సినిమా మా సంస్థలో మరో బ్లాక్‌బస్టర్ అవుతుంది. జూలైలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతాం’’ అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాసనా రామ్‌చరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, డి.వి.వి.దానయ్య, కె.ఎస్.రామారావు, ఎన్.వి.ప్రసాద్, ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కె.ఎల్.నారాయణ, దిల్ రాజు, వంశీ పైడిపల్లి, వక్కంతం వంశీ, కోటగిరి వెంకటేశ్వరరావు, జి.హరికుమార్, ఎ.ఎస్.ప్రకాష్, సత్య రంగయ్య, శిరీష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Filed Under: Mega FamilyFeatured