‘బలుపు’తో రవితేజ సక్సస్ ట్రాక్ లోకి ఎక్కుతాడా?

balupu

రవితేజ మంచి ఓపినింగ్స్ రాబట్టుకో గలిగిన హీరోలలో ఒకడు. కాని వరుసగా రొటీన్ సబ్జక్ట్స్ కు సేమ్ రోటిన్ మేనరిజమ్స్ తో సినిమాలు మీద సినిమాలు రావడం వలన జనాలకు రవితేజ సినిమాలంటే క్రేజ్ తగ్గుతుంది. ఇప్పుడు రాబోతున్న ‘బలుపు’ కూడా రొటీన్ సబ్జక్ట్ & రోటిన్ మేనరిజమ్స్ అనిపిస్తున్నా, ఆడియో హిట్ అవ్వడంతో అంచనాలు బాగానే పెరిగాయి అని చెప్పవచ్చు. గబ్బర్ సింగ్ హిరోయిన్ ‘శ్రుతిహాసన్’ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిరోయిన్ ‘అంజలి’ కూడా సినిమాకు ప్లస్ అయ్యారు.

రవితేజ మళ్లీ సక్సస్ ట్రాక్ లోకి వస్తాడని ఎక్సపెట్ చేస్తున్న ‘బలుపు’ ఈ నెల 28న విడుదల చేయడానికి నిర్మాత పరమ్ వి.పొట్లూరి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, కె.ఎస్.రవీంద్ర, మాటలు: కోన వెంకట్, ఎడిటింగ్: గౌతంరాజు, కెమెరా: జయనన్ విన్సెంట్, లైన్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాస్, సమర్పణ: పెర్ల్ వి.పొట్లూరి, దర్శకుడు: గోపిచంద్ మలినేని.

Filed Under: Extended FamilyFeatured