“అత్తారింటికి దారేది ..” ఆగష్టు 7 రిలీజ్ ఆశలు పెట్టుకోవచ్చా?

attarintiki-daredi-first-look

‘తీన్ మార్’ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ లో పెద్ద మార్పు వచ్చింది. నాన్ స్టాప్ గా సినిమా కోసం కష్టపడటం, అనుకున్న టైమ్ కు రిలీజ్ చెయ్యడం. ఇప్పుడు అదే కోవలో “అత్తారింటికి దారేది..” కూడా ఫినిష్ చేసేసాడు. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఈ సినిమా గురించి ఆ యూనిట్ సభ్యులు ఒక్క మాట మాట్లాడక పోయినా, సినిమాపై బీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు లోగో రిలీజ్ చేసారు .. పవన్ కళ్యాణ్ అఫీషియల్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు .. మంచి పాజిటివ్ హైప్ వచ్చింది .. ఆడియో వచ్చాక ఇంకా పెరిగే అవకాశం వుంది.

పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ తోడవ్వడంతో ‘మినిమమ్ గ్యారంటీ’ సినిమా అని అందరూ డిసైడ్ అయిపోయారు.

అంతా బాగానే వుంది కాని, రామ్ చరణ్ “ఎవడు” జూలై 31 వుండటం వలన, బిగ్ డౌట్ ఏమిటంటే “అత్తారింటికి దారేది ..” ఆగష్టు 7 రిలీజ్ ఆశలు పెట్టుకోవచ్చా? అని. ప్రొడ్యూసర్ రీ కనఫార్మ్ చేసినా ఈ డౌట్ పోవడం లేదు.

NTR బృందావనం & Mahesh Babu ఖలేజ ఒకే రోజు రిలీజ్ అని అభిమానులను రెచ్చగొట్టి, లాస్ట్ మినిట్ లో బృందావనం పోస్ట్ పోన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Filed Under: Pawan KalyanFeatured