Releasing Tomorrow

dsp

‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో, ‘రేసుగుర్రం’ లాంటి సూపర్‌ హిట్‌తో జోరు మీదున్న అల్లు అర్జున్ నటించిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. అంతే కాదు, జులాయి సూపర్‌హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా S/O సత్యమూర్తి. ‘యూ/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఆడియో ఇనిస్టెంట్ సూపర్‌హిట్ కాకపొయినా, ప్రేక్షకుల్లో మంచి హుషారును నింపింది. ఇక ట్రైలర్‌లో అల్లు అర్జున్ స్టైల్, త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ విడియో సాంగ్ రేపు రిలీజ్ కానుంది.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *